Valmiki Ramayanam in Telugu -Pullela Sriramachandrudu

 వాల్మీకి రామాయణం 

 – ఆచార్య పుల్లెల్ల శ్రీరామచంద్రుడు
A set of 7 volumes, each covering one Kanda of Valmiki Ramayanam. This is a faithful translation in Telugu by Padmasri Mahamahopadhayaya Prof. Dr. Pullela Sriramachandrudu embelished with beautiful illustrations by Bapu. ప్రపంచ సాహిత్య చరిత్రలో రామాయణం ఆది కావ్యం. అద్వితీయమైన కావ్యం. రామకథని మనోహరంగా చెప్పిన అమృత ప్రవాహం. ఇది 24 వేల శ్లోకాల సుధా స్రోతస్విని. దీనిని మూలంలో ఉన్నది ఉన్నట్లు, అందరికీ అర్థమయేలా సరళమైన తెలుగులో ప్రతి శ్లోకానికీ తాత్పర్యం వ్రాయించి ఒక ప్రమాణ గ్రంథం ప్రచురించడానికి పూనుకొన్నాం. అలా వ్రాయగల పండితుడి కోసం అన్వేషణ అవసరం లేక పోయింది. ఎందుకంటే తెలుగు చదవగల వారు ఎవరిని అడిగినా అందుకు సమర్థులని చెప్పే పేరు ఒక్కటే. ఆచార్య పుల్లెల్ల శ్రీరామచంద్రుడు గారు. ఈ విధంగా మూల గ్రంథానికి యథాతథమైన తాత్పర్యాలతో సర్వాంగ సుందరంగా వెలువడింది యీ వాల్మీకి రామాయణం.

1,350.00

Out of stock

మీ ఈమెయిల్ ఇచ్చిన యెడల, పుస్తకము స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఈమెయిల్ పంపగలము

Share Now

Description

Valmiki Ramayanam in Telugu

 This is a faithful translation in Telugu
 by Padmasri Mahamahopadhayaya Prof. Dr. Pullela Sriramachandrudu

  శ్రీమద్రామాయణము

‘రామాయణము’ భారతీయ వాఙ్మయమునకు తలమానికమై, ఆదికావ్యమని ప్రసిద్ధినొందిన మహోత్తమగ్రంథము. సర్వకాలములందు సకలజనులకు పుణ్యశ్లోకుడగు శ్రీరాముని చరిత్రము శ్రీరామచంద్రుని సత్యశీలుడగు సంస్మరణీయము, అనుసరణీయము.
ఉత్తమచరిత్రను, మహాపతివ్రతయగు సీతాదేవి పవిత్రచరితమును కూర్చి, ఆదికవి వాల్మీకి రామాయణ కావ్యమును రచించుటచే అజరామరుడైనాడు. సరళము, సరసము, మనోజ్ఞమగు రామాయణశైలి సంస్కృతజ్ఞులగు పండితులనేగాక జిజ్ఞాసువులగు సామాన్యులను కూడా రంజింపజేయుచున్నది.
శ్రీమద్వాల్మీకి రామాయణాన్ని ఆబాలగోపాలానికి అందుబాటులో ఉండే భాషలో మహామహోపాధ్యాయ డా. పుల్లెల శ్రీరామచంద్రుడుగారు అందించిన బాలానందినీ వ్యాఖ్యాసహితంగా ఆర్ష విజ్ఞాన ట్రస్టు తొలిప్రచురణగా వెలువరించినారు.
మహామహోపాధ్యాయ డా. పుల్లెల శ్రీరామచంద్రుడు ఆంధ్రప్రదేశ్ లోని, తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో 24/10/1927 జన్మించారు. తండ్రిగారైన శ్రీ సత్యనారాయణ శాస్త్రి గారి వద్ద కావ్యనాటక సిద్ధాంత కౌముద్యాదుల అధ్యయనం చేసి, శ్రీ కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి గారి వద్ద వ్యాకరణ వ్యాఖ్యాన గ్రంథాదులను అధ్యయనం చేశారు. మద్రాసు సంస్కృత కళాశాలలో వేదాంత శిరోమణి పరీక్షకు సంబంధించిన వేదాంత శాస్త్రాది గ్రంథాల అధ్యయనం చేసి శిరోమణి పరీక్షలో మద్రాసు విశ్వవిద్యాలయ సర్వప్రథములుగా ఉత్తీర్ణులైనారు. మద్రాసు విశ్వవిద్యాలయము నుండి తెలుగు విద్వాన్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయము నుండి సంస్కృతము యమ్.ఏ; ఇంగ్లీషు యమ్.ఏ; హిందీ యమ్.ఏ. పరీక్షలలో ఉత్తీర్ణులై ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి జగన్నాథ పండితరాయల అలంకారశాస్త్ర ప్రావీణ్యము” అను విషయముపై పి.హెచ్.డి. ఉపాధి సంపాదించారు. 39 సంవత్సరములు పాఠశాల కళాశాల – విశ్వవిద్యాలయాలలో సంస్కృతాధ్యాపకులుగా
డా. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు.
పనిచేశారు.
ఆర్ష విజ్ఞాన ట్రస్టు
సర్వమానవజాతి హితం కోసం తపస్సు చేసి పరమ సత్యాలను దర్శించి, లోకానికి అందించిన మహాత్ములను ఋషులు అంటారు. ఋషి అంటే వేదమని కూడ అర్ధం. ఋషులు మానవసముదాయానికి ఇహపర సుఖాల కోసం ఏర్చి తీర్చి కూర్చి పెట్టిన విజ్ఞానం అనంతంగా ఉంది. వేదమంత్రాలలో, దర్శనాలలో, ఇతిహాస పురాణాలలో, స్మృతి గ్రంథాలలో అది నిక్షిప్తమై ఉంది. న్యాయమూర్తి, యశఃకాయులు శ్రీ పమిడిఘంటం కోదండరామయ్య గారు భారతీయ సనాతన ధర్మ పరిరక్షణ కోసం భాగ్యనగరములో ‘ఆర్ష విజ్ఞాన ట్రస్టు’ అనే ధార్మిక వ్యవస్థను నెలకొల్పి రామాయణభారతభాగవతాదులను విద్వద్వరేణ్యుల వ్యాఖ్యానాలతో అలంకరించి తెలుగుపాఠకలోకానికి అందించారు. ప్రపంచం నలుమూలలా వ్యాపించి ఉన్న తెలుగు పాఠకలోకం వారికి సర్వదా కృతజ్ఞతాబద్ధమై ఉంటుంది.
జస్టిస్ శ్రీ పమిడిఘంటం కోదండరామయ్య గారు.