Upanishathula Sandesam

ఉపనిషత్తుల సందేశం

(ఈశావాస్య ఉపనిషత్ | కఠోపనిషత్ | కేనోపనిషత్సందేశం)

Weight   560 g
Book Author   Swami Ranganathananda
Pages   584
Binding   Paperback
Publisher   Ramakrishna Math, Hyderabad

150.00

Share Now

Description

ఆధునిక చింతన, ఆవశ్యకతల వెలుగులో ఉపనిషత్తుల వ్యాఖ్యానం
ఉపనిషత్ సారస్వతంలోని యావత్తు విషయాల సారం ఈశ, కేన, కఠోపనిషత్తులలో దర్శనమిస్తుంది. కాబట్టే గ్రంథకర్త మూడు ఉపనిషత్తులను ఎంచుకొని కూలంకషంగా ఈ గ్రంథంలో చర్చించటం జరిగింది. ఈ ఉపనిషత్తుల సందేశం మానవాళికి బలం, అభయం, ఐకమత్యం, సామరస్యం, ప్రేమ, సేవానిరతులను ప్రసాదిస్తుందనటం నిర్వివాదాంశంగా నిలుస్తుంది. ఈ గడ్డమీదనే ఈ ఉపనిషత్తుల మహోన్నత భావాలు వెల్లివిరిసినా, వాటిని మనం సముచిత రీతిలో అవగాహన చేసుకోలేదని, జీర్ణించుకోలేదనీ చెప్పటం సత్యదూరం కాదు. ఉపనిషత్తులు మానవాళికి అందచేస్తున్న సందేశాన్ని నేటి వర్తమాన కాలానికి తగినట్లుగా ఈ గ్రంథం అద్దం పడుతుంది. ఉపనిషత్తులను సరైన వెలుగులో అవగాహన చేసుకొని, తద్వారా మేలు పొందడానికి ఈ గ్రంథం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనటంలో సందేహం లేదు.