Description
రామాయణంలోని ఒక్కో ఘట్టం, ఒక్కో పాత్ర మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో సవివరంగా చర్చించారు. ఈ పుస్తకం ద్వారా కేవలం నీతి, నియమాలే కాకుండా…ఉత్తమ జీవన సందేశం అందించారు
చిన్నారులను దృష్టిలో పెట్టుకుని రాసిన ఈ పుస్తకంలో… పూర్తిగా గ్రంథ సారాన్ని గ్రహించేందుకు 68 బెడ్ టైం స్టోరీలను అందుబాటులో ఉంచారు. ప్రతీ కథ చివర ప్రత్యేకంగా ప్రాక్టీస్ షీట్‌నూ పొందుపరిచారు. దీని వల్ల పిల్లల్లో అనలిటికల్ థింకింగ్, లాజికల్, రీజనింగ్ వంటి నైపుణ్యాలను పెరుగుతాయంటున్నారు రచయితలు. ఇప్పటికే.. ఈ పుస్తకం నచ్చి… కొన్ని పాఠశాలు వారి విద్యార్థులకు ఈ పుస్తకాన్ని బోధిస్తున్నారు.
———————–
తవాస్మి రామాయణం రచన వెనుక దాగున్న 8 ఏళ్ల తపన
ఈ రోజుల్లో పురాణాలు…వయసు మళ్లిన పెద్దలే తప్ప…చిన్నారులకు కాదు. ఎందుకని అడిగితే… ఆ విషయాలు వారికి అర్థం కావు కాబట్టి అనే సమాధానం వస్తుంది. కానీ… ఈ గ్రంధాల విశిష్టత, అద్భుత పరిజ్ఞానాన్ని తర్వాతి తరాల వారికి అందించకపోతే ఎలా..? ఈ ప్రశ్నే ఆ యువకుడిని కదిలించింది. రామాయణ, మహాభారతాల్లోని నీతి, నిజాయితీలను చిన్నారులకు అర్థం అయ్యేలా.. ఓ రచన చేసేలా చేసింది. అలా… వెలువడ్డ పుస్తకమే.. తవాస్మి రామాయణం. దీన్ని రచించిన వ్యక్తే.. ప్రొద్దుటూర్‌కు చెందిన శ్రీరామ చక్రధర్.
తవాస్మి రామాయణం రచన వెనుక దాగున్న 8 ఏళ్ల తపనభారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలైన మహాభారతం, రామాయణాలు… సమాజ వికాసానికి కావాల్సిన ఎన్నో అంశాల్ని తెలియ జేస్తుంటాయి. అన్నదమ్ములు, తండ్రి-కొడుకులు, భార్య-భర్తల అనుబంధాలు ఎలా ఉండాలో తెలియజేస్తూ…ఎన్నో విలువల్ని బోధిస్తుంటాయి. నీతి, నిజాయతీ వంటి ధర్మాల్ని తెలియ జేయడం లో ముందు నిలుస్తాయి. అందుకే… చిన్న వయసులోనే పిల్లలకు ఈ గ్రంథాల్ని పరిచయం చేయాలి అంటున్నాడు… శ్రీరామ చక్రధర్.
.
ఆత్మసంతృప్తి కోసం..ప్రొద్దుటూర్‌కు చెందిన ఈ యువకుడు… ప్రముఖ బిట్స్ పిలానీ యూనివర్శిటిలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం… ఒరాకిల్, బ్రావో లూసి వంటి దిగ్గజ కార్పోరేట్ సంస్థల్లో ఐటీ ఉద్యోగిగా పని చేశాడు. చేతి నిండా పని, చదువుక తగ్గ కొలువు… అయినా ఏదో అసంతృప్తి. ఆ అన్వేషణలోనే ఆర్జన కన్నా.. ఆత్మసంతృప్తి ముఖ్యమనుకుని… ఉపాధ్యాయ వృత్తి చేపట్టాడు.
.
విలువలు చేరవేయాలని..చిన్నారులతో మమేకం అవుతున్న కొద్దీ… వారికోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నాడు… చక్రధర్. అదే విష।యాన్నిచిన జీయర్ స్వామీ వారి దగ్గర ప్రస్తావించగా… ఆయన సూచనల మేరకు పిల్లలకు అర్థమయ్యేలా రామాయణం, మహాభారతాల్ని అందించాలి అనుకున్నాడు. ఈ గ్రంథాల్లోని విలువల్ని చిన్నారులకు చేరువ చేసేందుకు సంకల్పించారు.
.
8 ఏళ్ల తపన..దాదాపు 8 ఏళ్లు మూల గ్రంధాలపై రీసెర్చ్ చేసిన చక్రధర్….తను నేర్చుకున్న అంశాల్ని తోటి రచయిత్రి శారదా దీప్తి సహకారంతో తవాస్మి రామాయణంగా మలిచాడు. ఈమె… చక్రధర్‌తో కలిసి బిట్స్ పిలానీలోనే చదువుకునే రోజుల్లో స్నేహితులు. శారదా కూడా 5 ఏళ్లు ఉద్యోగం చేసి… ఆధ్యాత్మిక మార్గం పట్టింది. అలా… వీరిద్దరూ కలిసి తవాస్మి రామాయణం రచన సాగించారు. చిన్నారులకు, పెద్దలకు సులువుగా అర్థం అయ్యేలా రాసిన ఈ పుస్తకం… ఆధ్యాత్మిక అనుభూతిని పంచడంతో పాటు ఆచరణ యోగ్యమైన కార్యచరణకు సిద్ధం చేస్తుందని చెబుతున్నారు.
.
ఉత్తమ జీవన సందేశం కోసం..రామాయణంలోని ఒక్కో ఘట్టం, ఒక్కో పాత్ర మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో సవివరంగా చర్చించారు. ఈ పుస్తకం ద్వారా కేవలం నీతి, నియమాలే కాకుండా…ఉత్తమ జీవన సందేశం అందించాలన్నది తన అభిలాషగా చెబుతున్నాడు…చక్రధర్. కాగా..గత నవంబర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
.
పలు పాఠశాలల్లో బోధన..చిన్నారులను దృష్టిలో పెట్టుకుని రాసిన ఈ పుస్తకంలో… పూర్తిగా గ్రంథ సారాన్ని గ్రహించేందుకు 68 బెడ్ టైం స్టోరీలను అందుబాటులో ఉంచారు. ప్రతీ కథ చివర ప్రత్యేకంగా ప్రాక్టీస్ షీట్‌నూ పొందుపరిచారు. దీని వల్ల పిల్లల్లో అనలిటికల్ థింకింగ్, లాజికల్, రీజనింగ్ వంటి నైపుణ్యాలను పెరుగుతాయంటున్నారు రచయితలు. ఇప్పటికే.. ఈ పుస్తకం నచ్చి… కొన్ని పాఠశాలు వారి విద్యార్థులకు ఈ పుస్తకాన్ని బోధిస్తున్నారు.
.
తవాస్మి రామాయణం ఆధారంగా పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా మరో 18 పుస్తకాలు, భవిష్యత్తులో భగవద్గీత, ఉపనిషత్తులు, భాగవతం వంటి గ్రంథాలను ప్రాక్టికల్ ఓరియెంటేషన్ లో తీసుకువస్తామని అంటున్నారు. మొదట్లో…. అందరిలానే వీరికీ నిరుత్సాహపరిచే మాటలు వినిపించాయి. కానీ… వాటిని పట్టించు కోకుండా తన లక్ష్యం వైపు సాగి విజయం సాధించారు. పవిత్ర గ్రంథాల్ని అందరికీ పరిచయం చేసే గొప్ప కార్యాన్ని పూర్తి చేశారు.