Srungara Naishadham by Srinatha

495.00

Share Now

Description

శృంగార నైషధము(సర్వంకష వ్యాఖ్య)

Srugara Naishadamu

శ్రీనాథుడు Srinathudu

అనన్యమైన అందచందాలన్నీ ఒకచోటనే రూపొందించినట్లున్న దమయంతి పరిచారికలతో సభాస్థలికి వచ్చింది. అందరినీ ఆకర్షించగలంత సిద్ధమంత్రశక్తి ఆమె అందానికుంది. స్వచ్ఛమైన నీళ్ళలో బంగారం ప్రతిఫలిస్తున్న రంగున ఉంది ఆమె శరీరం. ఆమె కళ్ళచూపులు మన్మథ సందేశాలను తోపింపజేస్తున్నాయి. ప్రతి అంగము కూడా తీర్చిదిద్దబడిన సౌందర్యరాశిలా మెరిసిపోతుంది దమయంతి.

నవరత్నాలు రకరకాలుగా పొదగబడిన నానావిధ భూషణాలూ – ఆమె ధరించడం వల్ల బంగారానికి సువాసన అబ్బినంత అదృష్టాన్ని పొందాయి.

ఆమె కళ్ళ అంచులలో కర్పూర, కస్తూరి రేఖలున్నాయి. కొంచెం పలువరుస కనిపించేటట్లుగా ఎడమైన నదురు పెదవులు సరస్వతీదేవి క్కూడా ముద్దు వచ్చాయి. ఆమె రాజహంసలకు నడకలు నేర్పే చందంగా లావణ్యంతో నడచి వస్తుంటే ప్రతి అంగమూ కదిలి, ఆమె ధరించిన నగలు సన్నగా సంగీతం పాడుతున్నాయి.

అప్సరసల వంటి గాయనీమణులు రెండువైపులా నిలబడి శుభగీతాలు పాడుతూ వెంటరాగా దమయంతి వేదిక మధ్యకు నడచి వస్తున్నది.

అభినవ మల్లినాథసూరి అని ప్రసిద్ధి గన్న శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రిగారు ఆముక్తమాల్యద, శృంగార నైషధ కావ్యాలకు విపులమైన వ్యాఖ్యానాలు రచించి ప్రచురించారు. విలువైన ఈ వ్యాఖ్యానాలను ఆంధ్ర పాఠకలోకానికి అందించే ప్రయత్నమే ఇది.