సమగ్ర, సప్రామాణిక జీవితగాథ
శ్రీరామకృష్ణ పరమహంస జీవితంపై వెలువడిన సప్రామాణిక, సమగ్ర గ్రంథరాజమే శ్రీరామకృష్ణ పరమహంస. అవతారం అంటే ఏమిటి? ఏ పరిస్థితులలో అవతార పురుషుడు అవతరిస్తాడు? ఎలా ప్రవర్తిస్తాడు? సాధనలు ఎందుకు చేస్తాడు? మొదలైన విషయాలతో పాటు శ్రీరామకృష్ణుల జీవితాన్ని, అంతకు మునుపు లోకం కనీ, వినీ ఎరుగని ఆయన సాధనలను, అవతార పురుషునిలోని మానవత్వ, దైవత్వ సమ్మేళనాన్ని, శ్రీరామకృష్ణుల అవతార కార్యాన్ని విపులంగా ఈ గ్రంథంలో చర్చించారు. శాస్త్రాలకు ఆయన జీవితం ఎలా ప్రమాణమై భాసిల్లిందో వేదవేదాంతాలకు ఆయన ఎలా సజీవ భాష్యమై ఒప్పారారో ఈ గ్రంథం చదివిన వారికి అవగతమౌతుంది.