Description
ధ్యానము – ఆధ్యాత్మిక జీవనము
భారతదేశం యోగాభ్యాసానికి కేంద్రబిందువు. ఇటీవలి కాలంలో భారతీయులు తమ దైనందిన జీవితంలో యోగాభ్యాసానికి, ధ్యానానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించారు. కానీ వారు ఉరుకులు, పరుగులతో కూడిన తమ జీవనసరళిలోని ఒత్తిడుల నుంచి ఉపశమనం కోసం పరుగులు తీసేవారే కానీ పరమ పురుషార్థ సిద్ధ్యర్థం కాదు. అయినా చిత్తశుద్ధితో నిజమైన ఆధ్యాత్మిక జీవనం కోరి తపించే సాధకులు లేకపోలేదు. వారి జ్ఞానతృష్ణను తీర్చడం నిమిత్తమే ‘ధ్యానము – ఆధ్యాత్మిక జీవనము’ అనే ఈ గ్రంథం రూపుదాల్చింది. ఆధ్యాత్మిక సాధనలో సాధకులకు ఎదురయ్యే సంశయాలను ఈ గ్రంథం తీరుస్తుంది. ఈ గ్రంథ రచయిత అయిన స్వామి యతీశ్వరానంద రామకృష్ణ సంఘంలో వరిష్ఠ సాధువుగా నిలిచినవారు. వారు మానవీయ సమస్యలను లోతుగా అవగతం చేసుకొని సర్వాత్మ భావంతో ప్రేమను, కారుణ్యాన్ని వర్షించిన సాధుశీలి. సాధకులకు తమ పరమ గమ్యమైన ఆత్మ సాక్షాత్కార సాధనలో మార్గదర్శకమై, స్ఫూర్తిదాయకమై ఒప్పారుతుంది ఈ గ్రంథం.
Weight | 840 g |
---|---|
Book Author | Swami Yatishwarananda |
Pages | 808 |
Binding | Paperback |