Sri Devi Bhagavatamu Vachanamu

Sri Devi Bhagavatamu Vachanamu

శ్రీ దేవి భాగవతము వచనము
రచయిత : స్థానాపతి రుక్మిణమ్మ
Pages : 512

400.00

Share Now

Description

Sri Devi Bhagavatamu Vachanamu

శ్రీ దేవి భాగవతము వచనము
రచయిత : స్థానాపతి రుక్మిణమ్మ
Pages : 512

Author : Sthanapati Rukminamma

“మద్వయం భద్వయం చైవబత్రయం వచతుష్టయం
అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్”

అని మొత్తం మహాపురాణాలు 18 అని వాటి పేర్లను ప్రథమాక్షరంతో చెప్పిన పట్టికలో ’భ’ తో ప్రారంభమయ్యేవి రెండు మొదటిది భాగవతం, రెండవది భవిష్యపురాణం. మనకు రెండు భాగవతాలు ఉన్నాయి. విష్ణుభాగవతం ఒకటి, దేవీ భాగవతం ఒకటి. పది పురాణాలు అని ప్రశ్నిస్తే ఎవరి వాదాలు వారికి ఉన్నాయి. ఇది ఒక ఎడతెగని చర్చ, ఎవరి నమ్మకాలు వారివి.

ఏమైనా తెలుగు వారిలో విష్ణు భాగవతానికి ఉన్నంత ప్రచారం దేవీ భాగవతానికి కూడా సమానంగా ఉన్నది. గత శతాబ్దంన్నర కాలంలోనే సుమారు పదికి పైగా దేవీ భాగవత తెలుగు గద్య పద్యానువాదాలు వచ్చాయంటే ఆస్తికులలో ఆ గ్రంథ ఆదరణను అర్థం చేసుకొనవచ్చు. ప్రస్తుత దేవీ భాగవతం 94 సంవత్సరాల కాలం జీవించిన ఈ మధ్యనే స్వర్గస్థురాలైన స్థానాపతి రుక్మిణమ్మ గారి వచనంలో వెలువడిన గ్రంథం. యొక్క మూడవ ముద్రణం. ఒక పురాణ గ్రంథం అందులో వచనం మూడవసారి ముద్రితం అయిందంటేనే ఆ గ్రంథప్రాశస్త్యం అవగాహన చేసుకొనవచ్చు.

చక్కని వ్యవహారిక వచనంలో ఎక్కడా బిగువుచెడని శైలిలో మూలానికి విధేయంగా ఆసక్తిని కలిగించే పదబంధాలతో సాగిన ఈ రచన, అందులోను పురాణ రచనకు తగినట్లుగా ఉన్నశైలి తెలుగు భక్త జనలోకాన్ని అలరిస్తుంది.

అష్టాదశపురాణాలను తెలుగు వ్యావహారిక వచనంలో ఆంధ్ర మహాజనులకు అందించాలనే సత్సంకల్పంతో ఇప్పటికి ఎనిమిది పురాణాలను సమర్పించిన విక్టరీ పబ్లిషర్సు, విజయవాడ వారి కృషిలో ఇది తొమ్మిదవ మైలురాయి. ఇప్పటికే ఈ క్రమంలో వెలువడిన ఎనిమిది పురాణాలకు వలెనే ఈ తొమ్మిదవ పురాణ కుసుమాన్ని తమ పూజామందిరాలలో భగవద్భక్తులు అలంకరించుకొంటారని ఆశంస.

– ప్రచురణకర్తలు