Sri Devi Stotra Ratnavali

శ్రీ దేవి స్తోత్ర రత్నావళి

120.00

Online Payment ఆర్డర్స్ త్వరగా పంపగలము

మరిన్ని Telugu Books కై
Share Now

Description

శ్రీ దేవి స్తోత్ర రత్నావళి

ఆ శక్తి నీలోనే ఆ తల్లి నీతోనే!
దేవీ శరన్నవరాత్రులు……………
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
దేశమంతా అమ్మ పూజలో తరించే దేవీ నవరాత్రులకు సమయం ఆసన్నమైంది. ఆ తొమ్మిది రోజులూ ఆసేతు హిమాచలం శక్తి ఆరాధనలో తన్మయత్వం చెందుతుంది. పూజలు, ఉత్సవాలు, వ్రతాలతో దేశమంతా అమ్మవారి ఆలయంలా మారే సమయమిది.
ఏ విశ్వచైతన్యం సృష్టి అంతా నిండి ఉందో…
గ్రహాలు, లోకాలు, చరాచర జగత్తు ఏ శక్తి నుంచి ఆవిర్భవిస్తున్నాయో…
నీలో, నాలో… సర్వ ప్రాణుల్లో ఉన్న జీవానికి మూల రూపం ఏమిటో…
భౌతిక రూపంలో జన్మలు పొంది, కర్మలు నిర్వర్తించే చైతన్యం ఎవరి నుంచి వస్తోందో…
ఆవిర్భవించడానికి, అంతరించడానికి మధ్యలో ఈ చైతన్యం అంతా ఎక్కడ నిక్షిప్తమై ఉంటుందో…
… ఆ శక్తే ఆది అక్తి… పరాశక్తి…
సృష్టిలో సమస్తం ఆమెలో అంతర్భాగమే. బుద్ధి, ప్రాణాలకు చైతన్యం ఎవరిస్తున్నారో ఆ శక్తినే మహర్షులు దేవి అన్నారు. ఆమెను ఉపాసించడమే దేవీ ఉపాసన. అలాంటి అమ్మవారి మూలతత్త్వం నిర్గుణ రూపమని మన పురాణాలు చెప్పాయి. ఆ తల్లి ఆశ్వయుజ శుద్ధపాఢ్యమినాడు అవతరించి, నవమి నాడు రాక్షస సంహారం చేసినట్లు నమ్ముతారు. కాబట్టి ఆ సమయంలో ఆది పరాశక్తిని పూజించి అనుగ్రహం పొందడం సంప్రదాయమైంది. అమ్మ దైవకార్యం కోసం స్థూలరూపం ధరించి లోకానికి వ్యక్తమైనప్పుడు అనేక అవతారాల్లో కనిపిస్తుంది. అందులోని తొమ్మిది రూపాలను శరన్నవరాత్రుల సందర్భంగా మనం తొమ్మిది రోజుల పాటు ఆరాధిస్తున్నాం. అయితే ఆది పరాశక్తి సగుణరూపం ప్రధానంగా  త్రిగుణాత్మకంగా ఉంటుంది. తమో గుణ ప్రధానమైనప్పుడు మహాకాళి అనే పేరుతో ఉంటుంది. రజోగుణంలో ఉన్న శక్తిని మహాలక్ష్మి అని, సత్త్వగుణంతో ప్రకాశించే శక్తి మహా సరస్వతి అని పిలుస్తారు. ఏ రూపంలోనైనా అమ్మ, సర్వచైతన్య స్వరూపిణిగా వెలుగొందుతుంది. లలిత పేరుతో పూజలందుకుంటుంది.
జగదాంబ తొమ్మిది రోజుల పాటు శత్రు సంహారం చేసి పదో రోజు విజయోత్సవం చేసుకున్నారు. కాబట్టి దశమిని విజయదశమి అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజుల పూజా విధానం గురించి మన పురాణాలు విస్తారంగా చెప్పాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ[్యమినాడు దీక్ష స్వీకరించి కలశ స్థాపన, ఆవాహనంతో మొదలుపెట్టి నవమి వరకు అమ్మవారిని అర్చిస్తారు. తొలిరోజు అమ్మవారి పేరు శైలపుత్రి, రెండో రోజు విదియనాడు బ్రహ్మచారిణి, తదియనాడు చంద్రఘంటా దేవి, చవితినాడు కూష్మాండా దేవి, పంచమినాడు స్కంధ మాత, షష్ఠినాడు కాత్యాయని, సప్తమినాడు కాళరాత్రి, అష్టమినాడు మహాగౌరీదేవి, నవమినాడు సిద్దరాత్రి, పదోరోజు రాజరాజేశ్వరిగా పూజించడం ఆనవాయితీ. తొమ్మిది రోజుల్లో వేర్వేరు పేర్లతో పిలవడం మాత్రమే కాదు తొమ్మిది రోజుల్లో జరిగే అర్చనలు వేరు. నైవేద్యాలు వేరు. అమ్మవారి అలంకారాలు కూడా వేర్వేరు. చివరకు తత్త్వాలు కూడా వేరుగా ఉంటాయి.
శరదృతువులో ఎందుకు?
సాధారణంగా భారతీయులు నిర్వహించుకునే పండగలన్నీ బహుళార్థ సాధకంగా ఉంటాయి. శరత్‌కాలం… వర్షాకాలానికి, శీతాకాలానికి సంధి సమయమిది. వర్షాకాలం చివరి దశలో ఆకాశం నిర్మలంగా ప్రకాశిస్తుంటుంది. ఏడాదిలో వసంత, శరదృతువులను యమదంష్ట్రికలుగా పిలుస్తారు. అంటే యముడి కోరలని అర్థం. ఈ సమయంలో వాతావరణంలో వచ్చే పెనుమార్పులు అనేక వ్యాధులకు కారణమవుతాయి. శరీరానికి, మనస్సుకి వాటిని తట్టుకునే శక్తి పొందడానికి శరన్నవరాత్రుల్లో ప్రజలు చేసే దీక్షలు ఉపయోగపడతాయి. మన శరీరంలోనే మనకు సహాయపడే శక్తులు, హాని కలిగించేవి కూడా ఉన్నాయి. వాటి మధ్య జరిగే సంఘర్షణనే మహాశక్తి రాక్షసులతో చేసే యుద్ధంగా భావించవచ్చు. మరెన్నో సామాజిక, ఖగోళ అంశాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి.
* పరమాత్ముడు శక్తుడు… ఆయన శక్తి జగదాంబ. పరమాత్ముడు తన శక్తిని వ్యక్తం చేయడమే సృష్టి. అందుకే ఈ సృష్టి సమస్తం వారి విలాసం. దీన్ని దివ్య శృంగారం అని కూడా అంటారు.
* జీవి తాలూకు క్రియాశీలత, సామర్ధ్యం కూడా శక్తి స్వరూపమే. అని దేవీ భాగవతం చెబుతుంది. లోకంలోని జీవులు ఏ పని చేయాలన్నా ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అనే మూడు రకాలైన శక్తి కావాలి. వీటినే త్రిశక్తులు అంటారు. ఒక పని చేయాలన్న కోరికనే ఇచ్చ లేదా సంకల్పశక్తి అని కూడా అనవచ్చు. ఆపని ఎలా చేయాలన్న జ్ఞానం కావాలి. చివరికి ఆ పని చేయాలి. దీన్నే క్రియ అంటారు. ఈ మూడింటికీ మూలమైన శక్తి మనలో వెలుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తెరిగి మనలోని అమ్మకు ప్రణమిల్లడమే మనం నవరాత్రుల్లో చేయాల్సిన విధి.
* ఈ సృష్టిలోని సమస్త శక్తికి మాత్రమే కాకుండా, త్రిమూర్తుల్లోని చైతన్యానికి కూడా అమ్మవారే మూలకారణం. అందుకే ఈ సృష్టిలోని ఎవరికి పని చేయడానికి సామర్థ్యం చాలకపోయినా శక్తి హీనులని అంటారు తప్ప బ్రహ్మహీనుడు, విష్ణుహీనుడు అని పిలవరు.