Description
శ్రీ లలితా దేవ్యై నమః
“శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీ మత్సింహాసనేశ్వరి
చిదగ్ని కుండసంభూత దేవకార్య సముద్యత” అంటూ మొదలవుతుంది శ్రీ లలితా సహస్రనామం.సర్వలోకాలకు అమ్మ అయిన ఆ జగన్మాత,అన్ని లోకాలకు అధికారిణి అయిన లలిత అమ్మవారి అవతారం గురించి బ్రహ్మాండపూరాణంలో కనిపిస్తుంది.
భండాసురడనే రాక్షసుడు దేవతలను వేధించే సమయంలో వాడిని అంతం చేయడానికి ఆ ఆదిపరాశక్తి అవతారించవలసిన పరిస్థితి ఏర్పడింది.”అమ్మ” అవతారించాలని శివుడు యజ్ఞం ఆరంభించాడు.అందులో సమస్త విశ్వాన్ని, 14 భువనాలను, 7సముద్రాలను అన్నిటిని ఆహుతులుగా వేశాడు. తరువాత దేవతలందరూ తమను తాము ఆ యజ్ఞంలో అర్పించుకున్నారు. అప్పుడు ఆ చిదగ్నికుండంలో నుండి అమ్మ దేవతల రక్షణకు అవతరించిందని, దేవతా స్త్రీ సైన్యాన్ని వెంటపెట్టుకొని వెళ్ళి వాడిని సంహరించిందని తెలుస్తొంది.
ఈ అమ్మవారి మహిమలు అమోఘం. లలితా సహస్రనామంలో “మహచతుష్షష్టికోటి యోగినీగణ సేవితా” అనే ఒక నామం ఉంటుంది.అంటే లలితా దేవిని 64 కోట్ల మంది మహయోగినులు నిత్యం పూజిస్తూ ఉంటారని అర్దం.
“కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః” అనే నామం, అమ్మవారి చేతి గొర్ల నుండే విష్ణు మ్ముర్తి యొక్క 10 అవతారలు వచ్చాయి అని చెప్తోంది.
“ఓం కామేశ బద్ధమాంగల్య సూత్రశోభిత కంధరాయై నమః” అనే నామాన్ని రోజు జపిస్తే త్వరగా వివాహం అవుతుంది.
“ఓం కదంబవనవాసిన్యై నమః” అనే నామాన్ని గృహిణులు జపిస్తూ పసుపు లేదా ఎరుపు పూవులతో పూజిస్తే కుటుంబసౌక్యం కలుగుతుంది.
“బిసతంతుతనీయసీ” అను నామం షచ్క్రెక్రాలపైన వున్న ‘కుండలనీ శక్తి’కి అధిదేవత. ఈ నామం మానసిక శారీరక దృడత్వాన్ని ఇస్తుంది.
ఇలా మన నిత్య జీవితంలో ప్రతి ఆటంకానికి ఈ లలితా సహస్రనామ స్తొత్రంలో నామాలు పరిష్కారాలగా చెప్పబడ్డాయి.
లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామలు “సూపర్ రెమిడిలు”గా పనిచేస్తాయి. చాలా మహిమ కలవి. ఇంట్లో లేక వ్యాపార స్థలంలో వాస్తు దోషముంటే రోజు వీటిని గట్టిగా చదివితే దాని చెడు ప్రభావాలు ఉండవు.గర్భవతులు రోజు లలితా సహస్రనామాన్ని చదివితే గర్భ దోషాలు తొలగిపొతాయి.పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ లలితా సహస్త్రనామాల మహిమ అనంత ఫలితాన్ని ఇస్తుంది.