Sri Mayamata Silpa Sastram

శ్రీ మాయమత శిల్ప శాస్త్రము
ప్రతిమ లక్షణం

– కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య
పేజీలు : 64 – A4 Size

198.00

Share Now

Description

Sri Mayamata Shilpa Shastra
Pratima Lakshanam
Author : Kandukuri Venkata Satya Brahmacharya

శ్రీ మాయమత శిల్ప శాస్త్రము
ప్రతిమ లక్షణం
– కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య

శిల్పశాస్త్రంలో చక్కటి పరిశోధన గ్రంథం

అజంతా ఎల్లోరా, ఖజురాహో వంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆ శిల్పసౌందర్యాన్ని చూసి వేనోళ్ల కొనియాడతాం. అంతెందుకు, ఆలయానికి వెళ్లినా ఆ దేవుని మూర్తిని చూసి అప్రతిభులవుతాం. అలాగే ఏదైనా అందమైన భవనాన్ని చూసినా, అలాంటి భావనే కలుగుతుంది మనకు. అయితే, వాటి నిర్మాణ విశేషాలను మాత్రం అంతగా గమనించ(లే)ము. ఒకవేళ గమనించినా, దాని గురించి వివరించే వాళ్లు మనకు అందుబాటులో ఉండరు.

ఈ లోటును పూరించడానికా అన్నట్లు ఆగమ శాస్త్ర పండితుడు, శిల్పశాస్త్ర ప్రవీణుడు, శ్రీశైలప్రభ అనే ధార్మిక పత్రికకు సహాయ సంపాదకులుగా పని చేస్తున్న కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ‘శ్రీ మయమత శిల్పశాస్త్రం’ అనే గ్రంథాన్ని రచించారు. మయమతమనగానే మనకు మహాభారతంలోని మయసభా సన్నివేశం కదలాడడం కద్దు. విశ్వకర్మ కుమారుడైన మయబ్రహ్మ పాండవులకు ఇంద్రప్రస్థాన్ని నిర్మించి ఇచ్చిన శిల్పశాస్త్రాచార్యుడు.

తెలుగునాట మయమహర్షి రచించిన గ్రంథాలకు ఎంతో ప్రాచుర్యం ఉన్న నేపథ్యంలో మయమతమనే ఈ గ్రంథాన్నే వివిధ భాగాలుగా విభజించి, వాటిలో ప్రథమంగా ప్రతిమాలక్షణమనే అధ్యాయాన్ని చక్కటి వాడుక భాషలో అందించారు బ్రహ్మాచార్య. ఆలయాలలోనూ, ఆలయ ప్రాకారాలపైనా అగుపించే వివిధ దేవతాప్రతిమలను ఎలా నిర్మించాలో సచిత్రంగా వివరించే ఈ గ్రంథం నూతనంగా దేవాలయ నిర్మాణం చేసేవారికి, ఆలయ జీర్ణోద్ధరణ చేసే అధికారులకు, శిల్పశాస్త్ర విద్యార్థులకు కరదీపిక వంటిది.
(సాక్షి దినపత్రిక)

శిల్ప వాఙ్మయం

విశ్వకర్మ కుమారుడే మయబ్రహ్మ. మయుడి పేరిట ఎందరో శిల్పాచార్యులు పారంపర్యంగా కనిపిస్తారు. ప్రస్తుతం లభిస్తున్న శిల్పశాస్త్ర గ్రంథాలన్నింటిలోనూ మయబ్రహ్మ విరచితమైన శిల్పశాస్త్రమే ప్రాచీనమైనది. ఇది ఆలయప్రతిష్ఠలకు సంబంధించినది. ఇందులో బ్రహ్మ మొదలుకొని సంప్రదాయ దేవీ దేవతల లక్షణాలను వివరించారు.జినవల్లభుడు, బుద్ధుడు,శాస్తా వంటి వారి లక్షణాలు కూడా ఉన్నాయి. ఆలయాలలో వివిధ స్థానాలలో ప్రతిష్ఠించే విగ్రహాల కొలతలు, వాటి లక్షణాలను మయబ్రహ్మ వివరించాడు. నూతన ప్రతిష్ఠలతోపాటు జీర్ణోద్ధరణ విధానాలను కూడా తెలియజేశాడు. శిల్పశాస్త్రప్రవీణులు కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య సంస్కృతంలోని ఈ గ్రంథానికి చక్కటి తెలుగు అనువాదాన్ని అందించారు.ఆయా శిల్పాలకు సంబంధించిన అరుదైన చిత్రాలను కూడా జతచేర్చిన ఈ గ్రంథం శిల్పశాస్త్రాన్ని అధ్యయనం చేసేవారికి ఉపయుక్తం.అలాగే వివిధ దేవతాలక్షణాలను సచిత్రంగా తెలుసుకోవాలనుకునే సామాన్య పాఠకులను సైతం ఆకట్టుకుంటుంది.
(భక్తి మాసపత్రిక)

కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య
ప్రచురణ: కందుకూరి యామబ్రహ్మాచార్య శిల్పవాఙ్మయ పీఠం,