Sarva devata Kalyanotsava Gotra Pravaralu 2 PART

సర్వదేవతా
కల్యాణొత్సవ గోత్ర ప్రవరలు

2 Part

198.00

Share Now

Description

సర్వదేవతా కల్యాణొత్సవ గోత్ర ప్రవరలు 2

గోత్ర ప్రవరలు అంటే ఏమిటి ??
శ్రీ రామునికి కూడా గోత్ర ప్రవరలు ఉన్నాయా ??

అలా అయితే సీతమ్మకు ఉన్న గోత్ర ప్రవరలు ఏమిటో తెలియచేయండి ??

గో అంటే   వంశము అని
త్ర అంటే రక్షించే వాడని అర్ధము
మన వంశమును రక్షించేందుకు కొందరు మహా ఋషులను ఏర్పాటు చేసారు ఋషులు , ఏ ఋషులను ఏ వంసేముల రక్షణ కొరకు ఏర్పాటు చేసేరో వారి పేర్లను చెపుతూ, తనకు సంబంధించిన వివరములను  వెల్లడించేది, ప్రవర . ఈ  చెప్ప పడిన ఋషుల లో  ప్రధాన ఋషి పేరేమిటో ఆ  పేరుని చెప్తే అది గోత్రం .
ఉదా ::  భరద్వాజ గోత్రం ఉంది అనుకుంటే  ” అంగీరస, బార్హస్పత్య, భరద్వాజ ”   అనే పేర్లు కల ముగ్గురు ఋషులు ఈ గాత్రాన్ని  రక్షించే వారు. ప్రధాన రుషి భరద్వాజుడు కాబట్టి  భరద్వాజ ( భరద్వాజునితో సమాన మయిన గోత్రం )  లేదా భారద్వాజ ( భారద్వాజునికి సంబందించిన ) గోత్రం అవుతుంది .

శ్రీ రామ ప్రవరహ :    
చతుస్సార పర్యంతం గో  భ్రాహ్మణేభ్యశ్శుభమ్ భవతు. వాసిస్ఠ  మైత్రావరుణ,  కౌడిన్య, త్ర్యాయార్షేయ ప్రవరాన్విత  వసిస్ఠ  సగోత్రోద్భావస్య నాభాగమహారాజ వర్మణో నప్రేయ్, అజ మామా రాజ వర్మణహ్ పుత్రాయ, దసరధ మహారాజ వర్మణహ్  పుత్రాయ,  వసిస్ఠ సగోత్రోద్భావాయ శ్రీ రామ చంద్ర పరభర్మణే వరాయహ్

శ్రీ సీతా  ప్రవరహ :
చతుస్సార పర్యంతం గో  భ్రాహ్మణేభ్యశ్శుభమ్ భవతు. అంగీరస, అయ్యాస్య , గౌతమ,  త్ర్యాయార్షేయ ప్రవరాన్విత  గౌతమ   సగోత్రోద్భావస్య నాభాగమహారాజ వర్మణో నప్త్రీం , హ్రస్వ రోమ మహారాజ  వర్మణహ్ పౌత్రీమ్ , జనక  మహారాజ వర్మణహ్  పుత్రీం ,  గౌతమ  సగోత్రోద్భావాయ  సీతాదేవినామ్నీమ్  కన్యాం