Mahanyasa Purvaka Rudrabhishekam Kalpam

మహాన్యాస పూర్వక
రుద్రాభిషేక కల్పం

300.00

Share Now

Description

మహాన్యాసం Mahanyasa Purvaka Rudrabhisheka Kalpam

 శివుని లేదా రుద్రుని లింగ రూపంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వంటి పదకొండు ద్రవ్యములతో పదకొండు సార్లు రుద్రం, నమక చమక మంత్రసహితంగా అభిషేకించడం, అర్చించడమే ఏకాదశ రుద్రాభిషేకం. వ్యక్తి జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను, గ్రహదోషాల కారణంగా ఎదురయ్యే బాధలను, పాపాలను హరించి, వారికి శివానుగ్రహం కలిగి సుఖశాంతులను పొందడానికే కాక, విశ్వశాంతికి కూడా రుద్రాభిషేకం నిర్వహిస్తారు.
    రుద్రాభిషేకం వాతావరణంలో వ్యతిరేక ప్రభావాలనిచ్చే దుష్ట శక్తులని పారద్రోలి, అనుకూల ఫలితాలను కలుగచేస్తుంది. రుద్రాభిషేకంలో పురోహితులు నమకచమకాదులతో కూడిన శ్రీ రుద్రాన్ని పఠిస్తారు. రుద్రాభిషేకంలో రెండు భాగాలుంటాయి. మొదటి భాగం పరబ్రహ్మం(ఈశ్వరతత్త్వం) విశ్వాంతరాళంలోని ప్రతీ అణువులో ఉందని చెప్తే, రెండవ భాగం విశ్వంలోని ప్రతి అణువూ కూడా ఏకత్వాన్ని సూచిస్తుందని చెప్తుంది.
   రుద్రాభిషేకం చేయడానికి ముందు మహాన్యాసం చేస్తారు. మహాన్యాసం శరీరాన్ని, మనస్సుని, ఆత్మని శుద్ధి చేసే ఒక ప్రక్రియ. ఇందులో భక్తుడు తనని తాను ఈశ్వరుని అంశగా భావించుకొని , తనలోకి ఆ ఈశ్వరతత్వాన్ని మంత్రపూర్వకంగా ఆవాహన చేసుకోవడం ద్వారా పరిశుద్ధుడౌతాడు. ఇలా తానే రుద్రుడి అంశ అనే భావనతో రుద్రాభిషేకం చేయడానికి అధికారం సంపాదించుకుంటాడు.
    మనః కారకుడైన చంద్రుడు (సోముడు) ప్రభావం అధికంగా ఉండే సోమవారం నాడు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే అది విశేషమైన ఫలితాన్నిస్తుంది. మాస శివరాత్రి రోజున కానీ, మహాశివరాత్రి రోజున కానీ, నిర్వహించే మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మరింత శుభ ఫలితాల్నిస్తుంది.
———————
NO STOCK