Description
శ్రీ చండీ సప్తశతి
దుర్గాసప్తశతి పారాయణ *విశిష్టత*
వేదజ్ఞానాన్ని సంతరించుకొన్న పద్దెనిమిది పురాణాల్లో మార్కండేయ పురాణం ఒకటి. అందులోని అంతర్భాగమే దేవీమహాత్మ్యం. ఇదే 700 శ్లోకాలతో శ్రీదేవీ సప్తశతిగా, చండీ సప్తశతిగా ప్రసిద్ధమైంది. ఇందులోని శ్లోకాలన్నీ మంత్రాక్షరాలే. అసలు శ్లోకాలు 578; రుషీశ్వరులు తమ విపులీకరణలతో వాటిని ఏడువందలకు పెంచడంతో సప్తశతిగా నిర్దేశితమైంది.
మార్కండేయ మహర్షి భాగురి అనే మునీశ్వరుడికి దేవీమహాత్మ్యాన్ని విశదీకరించాడు. రెండోదైన స్వారోచిష మన్వంతరంలో సురథుడనే రాజు రాజ్యాన్ని కోల్పోయి అడవులపాలవుతాడు. అదే సమయంలో సమాధి అనే వ్యక్తి గృహ సంబంధ సమస్యలతో అడవులపాలై రాజును కలుస్తాడు. వారి స్థితిగతులను తెలుసుకొన్న రుషి దేవి మహత్తును కథారూపంలో చెబుతాడు. అదే ‘శ్రీదేవీ సప్తశతి’.
కృత, త్రేత, ద్వాపర, కలియుగాలను కలిపి ఒక మహాయుగం అంటారు. 71 మహాయుగాల కాలం ఒక మన్వంతరం. మన్వంతర కాలానికి ఏలిక మనువు. మొత్తం 14 మన్వంతరాలు. ప్రస్తుతం నడుస్తున్నది ఏడోదైన వైవస్వత మన్వంతరం. ఎనిమిదోది సూర్యసావర్ణి మన్వంతరం. సురథుడన్న రాజే సూర్యసావర్ణి.
ఈ సప్తశతి 13 అధ్యాయాలుగా ఉంటుంది. ప్రథమ, మధ్యమ, ఉత్తమ చరితత్రయంగా విభజితమైంది.
ప్రథమ చరితంలో శ్రీమహావిష్ణువు మధుకైటభులనే రాక్షసులను సంహరించడంలో శ్రీదేవి (పరాశక్తి) మాయాప్రభావం ఆ రాక్షసులను ఆవహించి వారి చావుకు వారే కారణమయ్యేట్లు చేస్తుంది. బలగర్వంతో, అహంకారంతో మధుకైటభులు మహావిష్ణువును ‘నీకు వరం ఇస్తున్నాం… ఈ భూమి మీద జలంలేనిచోట మమ్ములను చంపు’ అంటారు. అది ప్రళయకాలం. శ్రీమహావిష్ణువు తన ఊరువులను విస్తరింపజేసి వారిని సంహరిస్తాడు. శ్రీదేవి అనుగ్రహంతో సృష్టిని కొనసాగిస్తాడు విధాత. ఈ చరితంలో శ్రీదేవిది మహాకాళి రూపం.
మధ్యమ చరితంలో శ్రీదేవి మహిషాసురమర్దినిగా ఆవిర్భవిస్తుంది. మహిషాసురుడి కంఠాన్ని కాలితో తొక్కిపట్టి శూలంతో కంఠనాళికలను పొడిచి, ఖడ్గంతో తలను ఖండిస్తుంది. మనసులోని మూర్ఖత్వం, మూఢత్వం, అహంకారం అనే మృగలక్షణాలను మహిషాసుర అంశలుగా గుర్తెరగాలి. ఈ చరితంలో శ్రీదేవిది మహాలక్ష్మి రూపం.
మూడోదైన ఉత్తమ చరితంలో పరాశక్తి విశ్వరూపం దాల్చి శుంభ, నిశుంభులనే రాక్షసుల పాలిట మహోగ్ర భయానకరూపంగా కనిపిస్తుంది. సప్తశతి అయిదో అధ్యాయం నుంచి పదమూడో అధ్యాయం వరకు శుంభ నిశుంభుల సంహార ఘట్టమే.
శుంభుడు కోపంతో ‘దుర్గా! ఇది నీ గొప్పదనం కాదు. నీచుట్టూ ఉన్న శక్తుల గొప్పదనం’ అంటాడు. ‘మూర్ఖుడా! అన్ని రూపాలు నావే. అంతా నేనే!’ అని దుర్గ బదులివ్వగానే- జ్యోతిర్మయశక్తి రూపాలైన బ్రహ్మణి, మహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, నారసింహీ, ఇంద్రి ఆ తల్లిలో అంతర్హితమవుతాయి. ఘోర యుద్ధంలో శుంభుడు హతుడవుతాడు. ఈ చరితంలో అమ్మవారిది శ్రీ మహా సరస్వతీ స్వరూపం.
శ్రీమహా కాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సరస్వతి… ఈ మూడు రూపాల సమష్టి రూపమే శ్రీదేవి.
శ్రీదేవిని నవమూర్తి రూపంగా ధ్యానించాలని సప్తశతి చెబుతోంది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధి ధాత్రి… నవరూపాలు.
ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో, భక్తిభావంతో అష్టమి, చతుర్దశి, నవమి రోజుల్లో దేవీ మహాత్మ్యాన్ని వింటారో, పఠిస్తారో వారికి శత్రుభయం ఉండదని సౌభాగ్యవంతులవుతారని ఫలశ్రుతిగా శ్రీదేవి అభయం ఇస్తుంది.
చండీ సప్తశతి ఆధ్యాత్మికపరులకు అమృత సింధువు, ముముక్షువుల పాలిట అక్షరాలా కల్పతరువు!
– దానం శివప్రసాదరావు
శరన్నవ రాత్రులు (దేవి నవరాత్రులు) తొమ్మిది రోజులూ,దుర్గా సప్తశతిని పారాయణ చేయగల వారికి సమస్తసౌభాగ్య ఆయురారోగ్యములు, అఖండ పుణ్యఫల ప్రాప్తిస్తుంది.
సప్తశతి విశిష్టత: ఇంద్రాది దేవతలను అష్టకష్టాలపాలుచేసిన అసురులు విర్రవీగటం; దేవతల మొరపై కటాక్షించినదుర్గాపరమేశ్వరి తిరిగి దేవతలకు స్వర్గలోక సామ్రాజ్యంఇప్పించడం దుర్గా సప్తశతిలో ప్రధానాంశం. ఇందులో లౌకికమైన కొన్ని కథలు కూడాచేరి ఉన్నాయి. తానెంతో ప్రేమతో,’తనవారు’అని భ్రమసినభార్యాపుత్రుల చేతనే బయటకు తరమబడిన వైశ్యప్రముఖుడు ‘సమాధి’కథ, శత్రువుల చేత చిక్కి అంతవరకుసమస్త సుఖభోగాలనుభవించిన రాజు’సురధుడు’మన్యాశ్రమం చేరుకున్న వైనం…….తదుపరి-ఆవైశ్యవరుడు,ఈ రాజప్రముఖుడూ కూడా దేవీ అనుగ్రహంచేత తిరిగి తమ-తమ యథాస్థితులనుపొందగలగడం……….ఇత్యాది గాథలు దుర్గాదేవిమహిమను అపురూపంగా చూపిస్తున్నవి.
ఒకప్పుడు దేశంలో ఉపద్రవాలు, కరువు,ప్రకృతివైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఋత్విక్కులచేత ఈదుర్గాసప్తశతి పారాయణ చేయించేవారని శతసంఖ్యపారాయణవల్ల అరిష్టాలు తొలగి అద్బుత ఫలితాలుకలిగాయని ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఇది కూడామహర్షులే జగత్తుకు తెలియజేసిన అపూర్వసత్యం.
ఇంతటి విశిష్టత కలిగిన ఈ దుర్గా సప్తశతి యందు 13అధ్యాయాలున్నాయి. నవరాత్రి తొమ్మిదిరోజులలోను ఈ13 సంఖ్యగల అధ్యాయాలను ఎలా పారాయణ చేయాలి?అనే సంఖస్య సహజంగానే ఎవరికయినా కలుగుతుంది.ఇందుకు 3 విధాలను ఇక్కడ సూచించటం జరిగింది. దేవీకటాక్షం పొందగోరువారు ఈ 3 విధాలలో ఏదిఎన్నుకున్నాఫలితం పొందడంలో మాత్రం ఎటువంటి తేడాఉండదు. కనుక భక్తులు తమకు అనుకూలమైన రీతినిఎంపిక చేసుకోగలరు. మరో అంశం…..ఈ పారాయణసమయంలో-ఆయా అధ్యాయాల్లో దేవతలు, ఇంద్రుడు,మునులు మున్నగు వారి స్తోత్రములు సందర్బానుసారంచేర్చబడి ఉన్నాయి.అవి ఇంకాఅద్బుతఫలదాయకమైనవి.
మొదటి విధానము:
ఆశ్వయుజ మాసములోని శుక్లపక్షపాస్యమి మొదలునవమి వరకు తొమ్మిదిరోజులను శరన్నవ రాత్రములుఅంటారని తెలిసినదే! ఈ 9 రోజులు అత్యంతపుణ్యప్రదమైన రోజులు. పారాయణ, నామజపం,దేవీస్తోత్రం, ఉపాసన, అర్చన….ఎవరికి ఏదిఅనుకూలమైతే అది ఆచరించటం అద్బుతపుణ్యదాయకం. మొదటి రోజు మొదలు తొమ్మిది రోజులూప్రతి దినమూ 13 అధ్యాయాములను పారాయణచేయుట ఒక పద్దతి, పారాయణకు శ్రద్దభక్తులు అత్యంతఅవసరం.13 అధ్యాయాలు ప్రతి రోజులు (కూర్చున్నఆసనం పై నుంచి కదలకుండా) చేయడానికి కనీసం వారివారి సామర్థ్యాన్ని బట్టి ఐదారుగంటలకు తక్కువ లేకుండాపట్టవచ్చు! దైవకృప అపారంగా గల వారికి ఇదిసాధ్యపడవచ్చు.!.మిగిలినవారికి మరో రెండు విధాలు:
రెండో విధానము:
1వరోజు (పాడ్యమి) ఒకే ఒక్క ప్రధమాధ్యాయం మాత్రమే
2వరోజు(విదియ) రెండు,మూడు,నాలుగు అధ్యాయాలు
3వరోజు(తదియ) ఐదు మొదలు పదమూడుఅధ్యాయాలను పూర్తిగా
పైన చెప్పినట్లు-తొమ్మిది రోజులూ పుణ్యప్రదమైనవే కనుకమూడేసి రోజులను పారాయణకు ఎంచుకోవచ్చును.నియమం మాత్రం ఒక్కటే! “ఏ మూడురోజులయినా”అన్చెప్పి ఒకటో రోజు చేసి, రెండ్రోజులతర్వాత కొన్ని అధ్యాయాలు, మరో రెండ్రోజులు ఆగి కొన్నిఅధ్యాయాలు చదువరాదు. పాడ్యమి, విదియ, తదియలుఎవరికైనా ఇబ్బందుల-ఆటంకాల దృష్ట్యా కుదరనపుడు-చివరి మూడు రోజులను(సప్తమినాడు కాక), దుర్గాష్టమి,మహర్నవమి, విజయదశమిని ఎన్నుకొనవచ్చును.అనగా10వరోజు అయినప్పటికీ-దసరా పండుగ (విజయదశమి)రోజును కూడా కలుపుకోగలరు.
మూడో విధానము:
మొదటిరోజు-మొదటి అధ్యాయం
రెండవరోజు-రెండు,మూడు అధ్యాయాలు
మూడవరోజు-నాలగవ అధ్యాయం
నాల్గువరోజు-ఐదు,ఆరు అధ్యాయాలు
ఐదవరోజు-ఏడవ అధ్యాయం
ఆరవరోజు-ఎనిమిదో అధ్యాయం
ఏడవరోజు-తొమ్మిది,పది అధ్యాయాలు
ఎనిమిదవరోజు-పదకొండవ అధ్యాయం
తొమ్మిదవరోజు-పన్నెండో అధ్యాయం
విజయదశమి రోజు-పదమూడో అధ్యాయం.
ఈ ప్రకారం పైన సూచించిన విధాలలో ఏదైనాఎన్నుకోవచ్చు! అయితే, పారాయణ చేస్తున్నంతకాలం ఈవిషయాలపై శ్రద్ద వహించాలి :
దుర్గాష్టోత్తర శతనామ/సహస్రనామములతో(ఏదినా సరే-ఒకటి)పూజించుట.ధూపదీప నైవేద్యాలుఅర్పించుట.
పారాయణకు ముందు అక్షతలు చేతులోకితీసుకొని, తాము కోరుకున్న కోరికనుమనస్సులోనే చెప్పుకొనుట.
పారాయణం అయిన వెంటనే అష్టోత్తర శతనామస్తోత్రం పఠించుట. పునఃపూజచేయుట.
పానకం/వడపప్పు(పంద్యారాలకు) కొబ్బరి,బెల్లంపొంగలి/దద్యోజనం/వడలు వంటిపదార్థాలలో ఎవరి శక్త్యానుసారం వారుమహానైవేద్యం సమర్పించుట.
పూర్ణిమ/శుక్రవారంనాటికి (ఏవైనాఅనివార్యమైన ఆటంకాలు ఎదురైనప్పుడు)పారాయణ ముగిసేలా చూసుకొనుట.
పారాయణ పరిసమాప్తమైనరోజున,ముత్తైదువను భోజనానికిఆహ్వానించి, వస్త్రం, ఎర్రనిది దక్షిణ సహితంగా(9 సంఖ్య ఉండేలా) దానం ఇచ్చిపాదనమస్కారం చేయుట.
ప్రతి పారాయణ భాగానికి ముందుగా ఈ 3శ్లోకాలు పఠించుట.
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయతే| సర్వ స్యార్తిహరేదేవి నారాయణి నమోస్తుతే||
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే|శరణ్యేత్ర్యంబక దేవి నారాయణి నమోస్తుతే||
సర్వబాధా వినిర్ముక్తో ధన ధాన్య సుతాన్వితః| మనుష్యోమత్ప్రసాదేన భవిష్యతి నసంశయః||
దుర్గాసప్తశతీ పారాయణం చేసేవారు ముఖ్యంగాగమనించాల్సింది: ఎటువంటి కోపతాపాలకిగాని/వికారాలకు
MP3 Audio Link – Click Here