Description
Rigveda ఋగ్వేదము
వేదాలలో ఋగ్వేదము అత్యంత పురాతనమైన వేదము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం ఋక్కుల రూపంలో ఉంటుంది. వేదాలలో ఋగ్వేదం మొదటిది .ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది. యజుర్వేదం మానవులకు, సామవేదం పితరులకు అని మనుస్మృతి వివరిస్తుంది.శౌనక మహర్షి ఋగ్వేదంలో 10,580 ఋక్కులున్నట్లు వర్ణించాడు. ఋగ్వేదం పద్యరూపంలో ఉంటుంది. ఋగ్వేదానికి ఐదు శాఖలున్నాయి….1 శాకల, 2 బాష్కల, 3 ఆశ్వలాయన, 4 మాండూక్య, 5 సాంఖ్యాయన.వీటిలో శాకల తప్ప ఇంకేవీ అందుబాటులో లేవు… ఋగ్వేదం రెండు విభాగాలుగా ఉన్నాయి. ఒకటి అష్టకాలు, వాటిలో అధ్యాయాలు, వాటిలో వర్గాలూ ఉంటాయి. రెండవ విభాగం మండలాలుగా విభజింపబడింది. మండలాలలో అనువాకాలూ, వాటిలో సూక్తాలుగా విభజింపబడ్డాయి. మొత్తం 1017 సూక్తాలలో 10,580 ఋక్కులలో 1,53,826 శబ్దాలు, వాటిలో 4,32,000 అక్షరాలు ఉన్నట్లు మహర్షి శౌనకుని వర్ణన…ఈ అక్షరాలు కలియుగం లోని సంవత్సరాలు ఒకటేనని వచనం.
ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలు పురాణ గాథలుగా వర్ణించబడ్డాయి. ఋగ్వేదంలో అనేక స్తోత్రాలు ఉన్నాయి. ఋగ్వేదంలోని దశమ మండలంలోని పురుష సూక్తం విశేషంగా ప్రశంసింపబడింది. ఋగ్వేదంలో సామాజిక ప్రవర్తన గురించి చక్కగా వర్ణించబడింది… ఋగ్వేదం కామితార్థాలను తీర్చే వేదం…. వర్షాలు పడాలంటే పర్జన్య సూక్తాలు పఠించాలని సూచింప బడింది… జూదం ఆడకూడదని అనేక సూక్తాలు బోధించాయి. కొన్నిటిలో జూదమాడిన వ్యక్తి వర్ణన ఉంది… శంకరాచార్యులచే ఋగ్వేదం ప్రశంసించబడింది. “ఆ నో భద్రాః క్రతవో యంతు విశ్వత॰” అనే సూక్త పఠనం మానవులను దీర్ఘాయుష్కులను చేస్తుందని వచనం. vedas in telugu