Description
Srividya Prakashika (Telugu)
– Sri Umamaheshwararavi Ayalasomayajula
శ్రీ విద్యా ప్రకాశిక
– శ్రీ ఉమామహేశ్వరరావు అయలసోమయాజుల
శ్రీ విద్య మంత్ర,యంత్ర,తంత్రములను గూర్చి శ్రీచక్ర నవావరణ పూజయైన శ్రీ చక్రయాగమును గూర్చిసవివరముగా కూర్చబడిన గ్రంథం ఈ శ్రీవిద్యా ప్రకాశిక. దక్షణాచార సంప్రదాయంలో శ్రీయాగక్రమం, పాత్రాసాధన, ముద్రలు, హోమవిధానంతో పాటుగా విశ్లేషణాత్మకంగా వివరించడమైనది. దక్షణాచార సాధకులకు ఈ కల్పం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే సంకల్పంతో పుస్తకం ముద్రించబడుతుంది.
దక్షిణాచారగురుపరంపరా సాధనలో శ్రీభువనానందనాథ దీక్షానామం కలిగిన శ్రీ అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి గారు గత దశాబ్దకాలంగా శ్రీచక్రనవావరణ పూజ నిర్వహిస్తూ, శ్రీయాగంలోని సూక్ష్మాలను గ్రహించి తమ శిష్యులను వారి సాధనక్రమంలో ముందుకునడిపిస్తూ వారి సాధనోన్నతికి తోడ్పడుతున్న శ్రీమాత స్వరూపం. వృత్తిరీత్యా తీరికలేకుండా ఉన్నా వీలుచేసుకుని అంతర్జాలంలో ఇతర సాధకులకు కలిగే సందేహాలనూ నివృత్తిచేస్తూ తమవంతు సహాయ సహకారాలందించుచున్నారు.