Yajurveda | Vedas in Telugu

యజుర్వేదము

2,700.00

+ Rs.150/- For Handling and Shipping Charges
Share Now

Description

Yajurvedam | యజుర్వేదము

వేదం అనగా (‘విద్’ అనే ధాతువు నుండి) ‘జ్ఞానం’ అని అర్ధం. యజుర్వేదం అంటే యాగాలు ఎలాచేయాలో చెప్పేది. యాగము, బలి, దానము మొదలైనవాటిని ఆచరించేటపుడు ఋత్విక్కులు[పురోహితులు] చెప్పే మంత్రాలు [పద్యాలు] యజుర్వేదంలో ఉన్నాయి.
 
యజ్ఞాలలో యజుర్వేదాన్ని అనిష్టించేవారికి “అధ్వర్యులు” అని పేరు.
 
కృష్ణ యజుర్వేదం లో తైత్తరీయ సంహితయందలి 7 అష్టకాలలో [కాండాలు]44పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 651 అనువాకములు, 2198 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి.
 
తైత్తరీయ బ్రాహ్మణం (పరాయితం)3అష్టకాలలో [కాండాలు]38పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 378 అనువాకములు, 1841 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి.
 
తైత్తరీయ ఆరణ్యకం 2 విభగాలు ఆరణ్యకం 5, ఉపనిషత్ 5, పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 290 అనువాకములు, 621 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి. మొత్తం 82పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి.1279 అనువాకములు, 4620 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి. తైత్తరీయ కృష్ణ యజుర్వేదంలో సంహిత బ్రాహ్మణం కలిసి ,
 
అధ్యయినం, సమన్వయం, ప్రయోగం, కష్టతరం కావటం వలన యాజ్ఞవల్క్య మహర్షి శుక్ల యజుస్సులను దర్శించారు సంహితయందలి 40అధ్యాయాలలో స్తోత్రాలున్నాయి. అందులో 286 అనువాకములు, 1987 ప్రకరణములు ఉన్నాయి.
 
యజుర్వేద స్తోత్రాలలో ప్రజాపతి, పరమేష్ఠి, నారాయణుడు, బృహస్పతి, ఇంద్రుడు, వరుణుడు, అశ్విని మొదలైన దేవతల స్తుతులున్నాయి. ఈ స్తోత్రములకు కర్తలు వసిష్ఠుడు, వామదేవుడు, విశ్వామిత్రుడు. యజుర్వేదంలో ప్రాణహింస మంచిది కాదని చెప్పబడింది. బలులు నిషిద్ధమని శతపథ బ్రాహ్మణంలో ఉంది. కాలక్రమంలో యజుర్వేదం కృష్ణ యజుర్వేదము (తైత్తరీయ సంహిత), శుక్ల యజుర్వేదము (వాజసనేయ సంహిత) అని రెండుభాగాలుగా విభజింపబడింది. శుక్ల యజుర్వేద సంహిత యందు “ఉదాత్తము”, “అనుదాత్తము”, “స్వరితము”, “ప్రచయము” అనే నాలుగు స్వరాలున్నాయి. బ్రాహ్మణము యందు “ఉదాత్తము”, “అనుదాత్తము” అనే రెండు స్వరాలున్నాయి. కృష్ణయజుర్వేదానికి “ఉదాత్తము”, “అనుదాత్తము”, “స్వరితము”, “ప్రచయము” అనే నాలుగు స్వరాలున్నాయి. శుక్ల యజుర్వేదంలోని ఈశావాస్యోపనిషత్తు చాలా ముఖ్యమైనదిగా భావింపబడుతున్నది. vedas in telugu