నివేదిత
పురాణవైర గ్రంథమాలలోని పన్నెండవ (చివరి) నవల. విక్రమార్క చక్రవర్తి తన కాలంలో తూర్పున కామరూప దేశము, దక్షిణాన సేతువు, పడమటన ఉత్తర బాహ్లికములు, ఉత్తరాన బదరీ నారాయణ క్షేత్రము ఎల్లలుగా దేశం మొత్తాన్నీ తన అదుపులో పెట్టాడు. అయితే ఆయన తర్వాత దేశం మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి 18 రాష్ట్రాలుగా విడిపోయింది. విక్రమార్క చక్రవర్తి మునిమనుమడైన శాలివాహనుడు తిరిగి దేశమంతటినీ ఒకే అధికారం క్రిందికి తెచ్చి అన్ని..
వేదవతి
పురాణవైర గ్రంథమాలలోని పదకొండవ నవల. విక్రమార్క చక్రవర్తి కథ ఇది. ఈయన శకకర్త. ఈయన మునిమనుమడు శాలివాహనుడు మరొక శకకర్త. ఇందులో కథ చాలా చిన్నది. విక్రమార్కుడు ఉజ్జయినిని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన దర్శనానికి ఒక బ్రాహ్మణుడు రావడంతో నవల మొదలవుతుంది. ఆయన సింహపుర దేశం నుండి వచ్చాడు. అది ఉరగ కటక దేశాల మధ్యలో వుంది. ఉరగ దేశానికి తూర్పున అభిసార కాంభోజ త్రిగర్త దేశాలున్నాయి. ఆ దేశాలు, …
‘హెలీనా’
పురాణవైర గ్రంథమాలలోని పదవ నవల. ఈ నవల లోని కథానాయిక హెలీనా. ఆమె తండ్రి మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాలకు రాజు. పూర్వం అతడు ఒక మహావీరుని సేనా నాయకులలో ఒకడు. అంటే ప్రసిద్ధ సేనానాయకులలో ఒకడు కాదు. మామూలు సేనానాయకుడే. ఆ మహావీరుడు తన ముప్పది మూడవ యేటనే చనిపోయాడు. అతడు గ్రీసు దేశస్థుడు. ఎన్నో దేశాలని గెలిచాడు. హెలీనా తండ్రి కూడా గ్రీసు దేశస్థుడే. ఆ మహావీరుడు….
పురాణవైర గ్రంథమాలలోని తొమ్మిదవ నవల. ఎప్పుడూ కథ ముందు చెప్పి, ఆ తర్వాత పుస్తకంలో నన్ను ఆకర్షించిన విషయాలేమిటో చెప్తున్నాను కదా! ఈ సారి కొంచెం మార్పు కోసం మొదట ఈ పుస్తకంలో నన్ను ఆకట్టుకున్న విషయాలు చెప్తాను. ఈ నవలలో కథ పెద్దగా లేదు కానీ మనుషుల ఆలోచనలు, ప్రవర్తనలు, బలహీనతలు,శక్తియుక్తులు, రాగద్వేషాలు – వీటికి సంబంధించిన కొన్ని సూక్ష్మమైన విషయాలని రచయిత చక్కగా వివరించారు. ప్రధాన పాత్రలైన…
ఇది పురాణవైర గ్రంథమాలలో ఎనిమిదవ నవల. ఏడవ నవల ‘అమృతవల్లి’ కాణ్వాయన వంశీయుడైన వాసుదేవుడు మగధ రాజ్యాధిపతి అవడంతో ముగుస్తుంది. ఆ వాసుదేవుడి మునిమనుమడైన సుశర్మ ప్రస్తుతం మగధ రాజ్యానికి రాజు. (వాసుదేవుడి కొడుకు భూమిమిత్రుడు, అతని కొడుకు నారాయణుడు, అతని కొడుకు సుశర్మ.) ఈ నవల శ్రీముఖుడు అనే క్షత్రియుడూ, తోహారు అనే కిరాతుడూ అడవిలో చేసే ఒక అన్వేషణ తో మొదలవుతుంది. అన్వేషణ దేనికోసం? ఒక పులిమానిసి కోసం. అవును, ముందుభాగం పులిగాను, వెనుక ….
అమృతవల్లి
ఇది ఏడవ నవల. ఆరవ నవల అయిన అశ్వమేథము శుంగ వంశపు రాజైన పుష్యమిత్రుడు రాజ్యానికి వచ్చిన కథని చెప్తుంది. ఈ శుంగవంశపు రాజులు పదిమంది. వారిలో చివరి రాజు దేవభూతి. అతనికే క్షేమభూతి అనే పేరు కూడా వుంది. ఈ క్షేమభూతి కాముకుడై రాజ్యాన్ని మంత్రులకి అప్పగించి దుష్టముగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన మంత్రి వాసుదేవుడు. ఈ వాసుదేవుడు కాణ్వాయన బ్రాహ్మణ వంశమునకు చెందినవాడు. ఈ కథ కలియుగ రాజవృత్తాంతములో,
అశ్వమేధము
ఇది పురాణవైరగ్రంథమాల లో ఆరవ నవల. “మౌర్యవంశపు చివరి రాజు బృహద్రథుడు. అతడు స్త్రీలోలుడై రాజ్యంలో శాంతి లేకుండా చేస్తే, అతని సేనాపతి పుష్యమిత్రుడు – సామవేదీయ బ్రాహ్మణుడు – అతనిని వధించి రాజ్యాన్ని గ్రహించాడు. ఈయన యశ్వమేథము జేసి సర్వ భారతదేశమును తన అదుపులోనికి తెచ్చి మరలా వైదికమతాన్ని ప్రతిష్టించాడు. అంతకు నాలుగు వందల ఏళ్ళ క్రితం నందుడు సర్వక్షత్రియ రాజవంశాలనీ నిర్మూలించి దేశము శూద్రరాజ్యము చేయగా, బౌద్ధమతం
చంద్రగుప్తుని స్వప్నము
ఈ నవల పీఠిక లో ఇచ్చిన వివరాల ప్రకారం ఇది అయిదవ నవల. దీనికి ముందరిదైన “నందోరాజా భవిష్యతి” లో రాక్షసుడు అనే బ్రాహ్మణుడు నందునికి రాజ్యాన్ని సంపాదించి పెట్టడం, సర్వ భారత దేశాన్ని అతనికి వశం చేసి పెట్టడం వుటుంది. నందవంశం 100 ఏండ్లు పాలించిన తర్వాత మౌర్య చంద్రగుప్తుడు రాజ్యానికి వస్తాడు క్రీ.పూ 1534 లో. ఆయన మంత్రి చాణుక్యుడు. ఈ నవలలో చాణుక్యుడు నందవంశాన్ని ఎలా
ఇది పురాణవైర గ్రంథమాలలో నాలుగవ నవల. శిశునాగ వంశపు రాజులు పదిమంది. వారిలో చివరివాడు మహానంది. శిశునాగ వంశము 360 ఏండ్లు రాజ్యము చేసింది. తరువాత నందుడు మగధ రాజ్యానికి రాజయ్యాడు. నందుడు మహానందికి శూద్ర స్త్రీ యందు పుట్టిన కొడుకు. నందుడి మంత్రి రాక్షసుడు. ఆ రాక్షసుడి ప్రతిభ ఎలాంటిదో, అతడు నందుడికి రాజ్యం ఎలా సంపాదించి పెట్టాడో, మగధరాజ్యములో శిశునాగ వంశము పోయి నందవంశము ఎట్లా ఆక్రమించిందో…
పురాణవైర గ్రంథమాలలో ఇది మూడవ నవల. రెండవ నవల నాస్తికధూమములో మగధరాజ్యం ప్రద్యోత వంశం వారి చేతిలోకి వెళ్ళడం చెప్పబడింది. ఈ మూడవ నవలలో శిశునాగ వంశం రాజ్యానికి రావడం చెప్పబడుతుంది. ప్రద్యోత వంశము కలియుగమున పదకొండువందల నలభై నాలుగేళ్ళ వరకు రాజ్యం చేసింది. ప్రద్యోతులు అయిదుగురు. ప్రద్యోతులలో చివరివాడు నందివర్ధనుడు. అతని తర్వాత కలిలో పదకొండువందల నలభై నాలుగేళ్ళ నుంచి పదిహేనువందల నాలుగు వరకు గిరివ్రజపురం రాజధానిగా శిశునాగ..
ఇది పురాణవైర గ్రంథమాలలో రెండవ నవల. ఈ నవలలో బాగా ఆకట్టుకునేది పాత్రచిత్రణ. ఈ నవల మొదలవడమే చాలా విలక్షణంగా మొదలవుతుంది. “శ్రీముండీ చాముండీ! నిన్నెందుకే యింత కాలము నుండి కొలుచుచున్నాను! నీకు బుద్ధి లేదే! నిన్ను దేవతవని కొలిచినవాడు పశువు…. ఇంకెన్నాళ్ళీ భారతీయ సంస్కృతి, వైయాసిక నాగరికత, కృష్ణ విరచిత భగవద్గీతా పఠనము, వేదోపనిషత్తుల రాజ్యము సాగనిత్తుము!? సాగనీయము. ఎచ్చటి దచ్చట నిర్మూలము చేయుదును….. నాకోర్కె తీర్చవలయును. అది
పురాణవైర గ్రంథమాలలో ఇది మొదటి నవల. ఇందులో భారత యుద్ధమైన తర్వాత వంద ఏళ్ళు గడిచిన నాటి కథ వ్రాయబడింది. అప్పుడు జనమేజయ మహారాజు తుంగభద్ర ఒడ్డున కొందరు మునులకు కొంత స్థలము దానం చేశాడట. ఆ దానశాసనం వుందట. అంతకన్నా ప్రమాణమేమి కావాలి? అంటారు విశ్వనాథ ఈ నవల పీఠికలో. ఈ మొదటి ….