Description
ఋషిపీఠం శివరాత్రి కానుక – పంచభూతలింగ మహిమ-తత్త్వం
ఋషిపీఠం భారతీయ మాసపత్రికలో ధారావాహికగా వచ్చినది ఇప్పుడు పుస్తకరూపంలో..
పంచభూతలింగ మహిమ-తత్త్వం | ప్రవచన పాఠం
పంచభూతలింగ క్షేత్రముల గురించి సారభూతంగా… సంక్షేపంగా… గాఢంగా వివిధ సందర్భాలలో ప్రవచించిన దానికి గ్రంథరూపం ఇది. పంచభూతాలలో లీనమై నడిపే ఒకే ఈశ్వరుడు వాటియందు ‘లింగాలు’గా లీనమై ఉన్నాడు. ఈ క్షేత్రాలను దర్శిస్తే పాపక్షయం జరిగి అంతటా ఉన్నదే పరమేశ్వరుడే అనే స్పృహ కలుగుతుంది. ప్రపంచమంతా పంచభూతక్షేత్రమే అనే మనిషి కూడా… • పంచభూత క్షేత్రమే.
మన శరీరంలో పంచభూతాలను చూస్తున్నాం. కానీ పంచభూతలింగాలుగా చూడడానికి ప్రయత్నం చేయాలి. ముందు అయిదింటిలో ఈశ్వరుని చూస్తే క్రమంగా అయిదింటినీ వదలి ఈశ్వరుని చూడగలం. పంచభూతాలను నియమించే పరమేశ్వరుని ” ఉపాసించడమే పంచభూతలింగ ఉపాసన. ఈ భావన. చెప్పిన వెంటనే కలుగదు కాబట్టి నిరంతరం భావించాలి. ‘అలా భావించి పరమేశ్వరునికి దగ్గర కావడానికి ఈ గ్రంథం తోడ్పడుతుంది.