Description
anjaneya sahasranamalu book (telugu)
శ్రీరాముడు అత్యంత ప్రేమతో చెక్కిన అంజన్న రూపాన్ని దర్శించుకోవాలంటే కడపలోని గండి ఆలయానికి వెళ్లాల్సిందే. శేషాచల కొండల్లో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న పాపఘ్ని నదీతీరాన ఉందీ వాయుక్షేత్రం. ఇక్కడ భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న హనుమంతుడికి శ్రావణమాసంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.
యత్రయత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్!
భాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకమ్!!
అంటే… శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్న వదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడు. అంతటి స్వామిభక్తి పరాయణుడైన అంజనీసుతుడు కాలిడిన చోట మహాలక్ష్మి స్థిరనివాసినియై ఉంటుంది. ఈ కారణంగానే హనుమంతుడిని ఐశ్వర్యకారకుడిగా భావించి శ్రావణమాసం నెలరోజులూ విశేషంగా అర్చిస్తారు. వీటిలో శనివారాలు స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనవని భక్తుల విశ్వాసం. అందుకే కడప జిల్లాలోని గండి క్షేత్రంలో శ్రావణమాసంలో వచ్చే నాలుగు శనివారాలూ ప్రత్యేక జాతర నిర్వహిస్తారు.