Description
*శ్రీ మణిద్వీప వర్ణనమ్*
*ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రహస్యాల గని*
భారతీయ ఆధ్యాత్మిక వాఙ్మయంలో శ్రీదేవీ భాగవతం అత్యంత విశిష్టమైనది.
అందులోనూ 12వ స్కంధంలోని ‘మణిద్వీప వర్ణన’ భక్తులకు కల్పవృక్షం వంటిది.
అయితే, ఈ మణిద్వీప వర్ణనను కేవలం పారాయణ గ్రంథంగానే కాకుండా, ప్రతి శ్లోకం వెనుక ఉన్న అంతరార్థాన్ని, వైజ్ఞానిక విశ్లేషణను జోడించి యల్. విజయ సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు (కంచిపీఠ ఆస్థాన సిద్ధాన్తి గారు) అందించిన “శ్రీ మణిద్వీప వర్ణనమ్ – పూర్వోత్తర పీఠికా సహితం” అనే గ్రంథం నేడు ప్రతి ఇంటిలో ఉండదగ్గ ఆధ్యాత్మిక నిధి.
వ్యాఖ్యాన వైశిష్ట్యం: ఒక వినూత్న కోణం
ఈ గ్రంథం కేవలం శ్లోకాలు, తాత్పర్యాలకే పరిమితం కాలేదు. ఇందులో ప్రతి శ్లోకానికి “శ్రీ విజయోల్లాసినీ వ్యాఖ్యానము” పేరుతో ఎనిమిది రకాల విశ్లేషణలు అందించబడ్డాయి.
ఆధ్యాత్మిక విశ్లేషణ: మన అంతఃకరణలో జరిగే మార్పులను వివరిస్తుంది.
వైజ్ఞానిక విశ్లేషణ: శ్లోకాలలోని అంశాలను క్వాంటం ఫిజిక్స్, థర్మల్ ఎనర్జీ వంటి ఆధునిక విజ్ఞానంతో ముడిపెట్టి వివరించారు.
జ్యోతిష, వాస్తు విశ్లేషణలు: గ్రహ దోషాలకు, వాస్తు సమస్యలకు ఈ శ్లోకాలు ఎలా పరిష్కారంగా పనిచేస్తాయో చూపారు.
మంత్ర, రత్న శాస్త్ర విశ్లేషణలు: శ్లోకంలోని బీజాక్షరాల శక్తిని, రత్న ధారణ ఫలితాలను వివరించారు.
పంచభూతాల సమతుల్యత – ఆరోగ్య ప్రదాయిని
ఉదాహరణకు, గ్రంథంలోని ఒక విశేష శ్లోకాన్ని గమనిస్తే:
”హృల్లేఖా గగనా రక్తా చతుర్థీ తు కరాళికా |
మహోచ్ఛుష్మా పంచమీ చ పంచభూతసమప్రభాః ||”
ఈ శ్లోకం ద్వారా అమ్మవారి ఐదు శక్తి స్వరూపాలు మన శరీరంలోని పంచభూతాలను ఎలా నియంత్రిస్తాయో వివరించారు. ‘హృల్లేఖ’ భూమి తత్త్వానికి, ‘గగన’ ఆకాశానికి, ‘రక్త’ అగ్నికి సంకేతాలని వివరిస్తూ.. ఇవి అసమతుల్యమైనప్పుడు కలిగే అనారోగ్యాలను, మానసిక అశాంతిని ఈ శ్లోక పారాయణ ద్వారా ఎలా అధిగమించవచ్చో అద్భుతంగా విశ్లేషించారు.
పురోహితులకు, సాధకులకు కల్పవృక్షం
ఈ గ్రంథంలో కేవలం వివరణలే కాకుండా, సామాన్యుల నుండి పురోహితుల వరకు అందరికీ ఉపయుక్తంగా ఉండేలా 300 రకములైన పరిహార ప్రక్రియలు [శాంతి ప్రక్రియలు / Remedies] పొందుపరచబడ్డాయి. మానసిక జడత్వం (Depression), భూమి వివాదాలు, శరీరంలోని అధిక వేడి వంటి అనేక సమస్యలకు నిర్దిష్టమైన పారాయణ క్రమాలను ఇందులో సూచించారు. నిత్యం ఎదుర్కొనే సమస్యలకు శాస్త్రోక్తమైన పరిష్కార మార్గాలను ఈ గ్రంథం అందిస్తుంది.
యోగ రహస్యాలు – మణిద్వీప యోగం
మణిద్వీపంలోని కాంతులను సాధకుడు తన కుండలినీ శక్తిని సహస్రారానికి చేర్చినప్పుడు పొందే ఉగ్ర-సౌమ్య కాంతుల మేళవింపుగా అభివర్ణించడం ఈ గ్రంథంలోని పరిశోధనాత్మక దృష్టికి నిదర్శనం.
”తప్తకాంచన సన్నిభమ్” – అనగా శివశక్తుల ఐక్యత వల్ల కలిగే బ్రహ్మజ్ఞాన కాంతి అని, అది భక్తుల హృదయాలలోని అంధకారాన్ని తొలగిస్తుందని ఈ గ్రంథం బోధిస్తుంది.
అమ్మవారి అనుగ్రహం పొందాలనుకునే భక్తులకు, శాస్త్ర రహస్యాలు తెలుసుకోవాలనే జిజ్ఞాసువులకు, ఉత్తమమైన పరిహార మార్గాలను (Remedies) నిర్దేశించే పురోహితులకు ఈ ‘శ్రీ మణిద్వీప వర్ణనమ్’ ఒక దివ్యౌషధం. పరమ ప్రామాణికమ్.
ప్రతి ఒక్కరూ ఈ గ్రంథాన్ని పారాయణ చేసి, ఆ పరాశక్తి కృపాకటాక్షాలకు పాత్రులు కాగలరు..
భక్తితో చేసే పారాయణ – భవబంధాల నుండి విముక్తి!
మోహన్ పబ్లికేషన్స్.
Send Your Messages Only 




































