Kumara Sambhavam telugu

కుమార సంభవము

-మహాకవి కాళిదాసు
8 సర్గలు | 1650 Pages
2 Parts| Case Binds
14.5 x 22.5 cm | 2,123 Grams

 

1,650.00

Share Now

Description

కుమార సంభవము
 
కుమార సంభవం కవికుల గురువుగా ప్రసిద్ధి పొందిన మహాకవు కాళిదాసుచే రచింపబడి ప్రసిద్ధి పొందిన కావ్యము. తారకాసుర సంహారం కొరకు శివ పార్వతుల వివాహము, కుమార స్వామి జననం ముఖ్యమైనవి. మొదట దక్షుడు యజ్ఞము చేయ సంకల్పించి దేవతలు, రాక్షసులతో సహా సమస్త లోకానికిఆహ్వానం పంపి తన అల్లుడైన పరమేశ్వరునిపై గల చులకన భావంతో శివునికి మాత్రమే ఆహ్వానం పంపడు. దీనికి బాధ పడ్డప్పటికీ సతీదేవి తన తండ్రి చేస్తున్న యాగానికి వెళ్ళాలన్న కోరికను భర్త అయిన పరమేశ్వరుని వద్ద ప్రస్తావిస్తుంది. దానికి పరమేశ్వరుడు పిలవని పేరంటానికి వెళ్ళడం సముచితం కాదని సతీదేవిని వారిస్తాడు. కాని తన తండ్రి చేస్తున్న యాగానికి వెళ్ళాలన్న గాఢమైన కోరిక కలిగిన సతీదేవి వెళతానని పట్టుబడుతుంది. చివరికి భార్య మాట కాదనలేక పరమేశ్వరుడు సమ్మతించి ప్రమథగణాలను తోడిచ్చి దక్షుని యజ్ఞానికి సతీదేవిని పంపుతాడు పరమేశ్వరుడు.
 
యజ్ఞానికి వచ్చిన సతీదేవిని గమనించిన దక్షుడు అనేకమైన పదజాలంతో పరమేశ్వరుని దూషిస్తాడు.జరిగిన ఆవమానం భరించలేక సతీదేవి యజ్ఞగుండంలో పడి కాలిపోతుంది. ఈ వార్త తెలిసి కోపోద్రిక్తుడైన పరమేశ్వరుడు వీరభద్రుని సృష్టించి యజ్ఞస్థలికి పంపుతాడు. వీరభద్రుడు విలయతాండవంతో యజ్ఞాన్ని సర్వనాశనం చేసి దక్షుని తల నరికి యజ్ఞగుండంలో పడవేస్తాడు. తరువాత దేవతలందరి ప్రార్థనతో శాంతించిన పరమేశ్వరుడు మేక తలను అతికించి దక్షుని బ్రతికిస్తాడు. జరిగినదానికి దక్షుడు శివుని క్షమించమని ప్రార్థిస్తాడు. తరువాత సతీదేవి మరణంతో శివుడు ఘోరమైన తపస్తులోనికి వెడతాడు.
 
ఇంతలో వర గర్వంతో లోకాలను పీడిస్తున్న తారకాసురుని పీడ విరగడకు పర్వతరాజైన హిమవంతునికి జన్మించిన పార్వతీదేవితో వివాహము జరిపించడానికి శివుని తపోభంగమొనర్చి పార్వతితో వివాహం జరపడానికి దేవతలు మన్మధుని పంపుతారు. తపో భంగమైన పరమేశ్వరుడు మన్మధున్ని భస్మం చేయడం, రతీదేవి ప్రార్థనతో మన్మధున్ని రతీదేవికి మాత్రమే కనబడేలా వరమివ్వడం జరుగుతుంది.
 
తరువాత దేవతలందరి ప్రార్థనతో పార్వతిని వివాహమాడడానికి అంగీకరించిన పరమేశ్వరుడు సన్యాసి వేశంలో తపస్సు చేస్తున్న పార్వతిని పరీక్షించి అనంతరం తన తరఫున పెళ్ళి విశయం అడగడానికి సప్తర్షులను హిమవంతుని వద్దకు పంపి పెళ్ళి నిశ్ఛయం చేసుకుని తరువాత పార్వతితో పరమేశ్వరుని వివాహం, అనంతరం కుమారస్వామి జననం తారకాసురుని వధ మొదలయిన విషయాలు మహాకవి కాళిదాసు చాలా చక్కగా వర్ణించాడు.