Health Guide

హెల్త్ గైడ్ 

144.00

Out of stock

మీ ఈమెయిల్ ఇచ్చిన యెడల, పుస్తకము స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఈమెయిల్ పంపగలము

మరిన్ని Telugu Books కై
Share Now

Description

హెల్త్ గైడ్ 
శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే అద్భుత‌మైన చిట్కాలు..!
సీజ‌న్ మారింది. ఇన్ని రోజులు మండే ఎండ‌లు, ఉక్క‌పోత‌ల‌తో ఇబ్బందుల‌కు గురైన జ‌నాలు ఇప్పుడు వ‌ర్షాలు, చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో సేద‌తీరుతున్నారు. కానీ వ‌ర్ష‌కాలంతోపాటే ఈ సీజ‌న్‌లోఅనేక అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా మ‌న‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. క‌నుక రోగాలు రాకుండా ఉండాలంటే ముందుగానే ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అవ‌స‌రం. అందుకు మ‌న శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేసుకోవాలి. కింద చెప్పిన చిట్కాలు పాటిస్తే దాంతో మ‌న శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. మ‌రి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ఉసిరిలో విటమిన్ సితోపాటు కాల్షియం, ఐరన్, పాస్ఫరస్, ఫైబర్‌లు అధికంగా ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం ఉసిరి మన శరీరంలో ఏర్పడే అనారోగ్యాలకు కారణమైన మూడు రకాల దోషాలైన వాత, పిత్త, కఫాల హెచ్చు తగ్గులను నియంత్రిస్తుంది. మన దేహంలోని రోగ నిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. దీన్ని మన దగ్గర ఎక్కువగా పచ్చళ్లలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఎండబెట్టిన ఉసిరికాయలు, వాటి పొడి కూడా మనకు మార్కెట్‌లో లభ్యమవుతోంది. నిత్యం రెండు సార్లు దీన్ని తీసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పొడిగా, కాయగా లేదా ఇతర పండ్లతో కలిపి కూడా దీన్ని తీసుకోవచ్చు. దీని వ‌ల్ల మ‌న శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బలంగా మారుతుంది.
2. మన దేశంలో పసుపును ఎక్కువగా వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. అయితే ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. శరీరంలో ఏర్పడే మూడు రకాల దోషాలను ఇది నియంత్రిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. సాధారణ జలుబు, పొడి చర్మం, కీళ్ల నొప్పులు, వాపులు వంటి అనారోగ్యాలకు ఇది చక్కని ఔషధంగా పనిచేస్తుంది. నిత్యం దీన్ని 1 నుంచి 3 గ్రాముల మోతాదులో వేడిపాలు లేదా నీటితో తీసుకోవాలి.
3. శరీరంలో ఏర్పడే వాత, కఫ దోషాలను అల్లం తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు ఇన్‌ఫెక్షన్లపై పోరాటం చేస్తుంది. ఆర్థరైటిస్, గౌట్, ఎడిమా, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడుతున్న వారు నిత్యం అల్లంను తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. నువ్వుల నూనెలో ఎండబెట్టిన అల్లం పొడిని కలిపి కీళ్లపై మర్దనా చేస్తే నొప్పులు తగ్గుతాయి. పలు శ్వాసకోశ వ్యాధులను తగ్గించే గుణం అల్లంకు ఉంది.
4. యాంటీ ఆస్తమాటిక్, యాంటీ ఇన్‌ఫెక్టివ్ గుణాలు తులసిలో పుష్కలంగా ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. తులసి ఆకుల రసాన్ని నిత్యం తీసుకుంటే శరీర రోగ నిరోధక వ్యవస్థ గాడిలో పడుతుంది. అల్లం, తేనె వంటి వాటితో దీన్ని కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.
5. శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో కోల్పోయిన శక్తిని తిరిగి ఇవ్వడంలో అశ్వగంధ మెరుగ్గా పనిచేస్తుంది. యాంటీ ఏజింగ్ గుణాలు ఇందులో మెండుగా ఉన్నాయి. అశ్వగంధ మొక్క వేర్ల పొడిని నిత్యం 3 నుంచి 6 గ్రాముల మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చని ఆవుపాలతో తీసుకుంటే చక్కని ఫలితాలు వస్తాయి. దీని వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగ ప‌డుతుంది. రోగాల బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించ‌వ‌చ్చు.