Description
Ayurveda Vaidya Chitkalu Book
పంచ ప్రాణాలకు.. 5 సూత్రాలు
కొత్త సంవత్సర ప్రణాళిక ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
పొద్దున్నే లేచి, రోజూ కచ్చితంగా వ్యాయామం చేస్తా.. ఆరు నూరైనా.. ఫస్ట్ నుంచి సిగరెట్లు మానెయ్యాల్సిందే.. రోజూ కనీసం రెండు పండ్లైనా తింటా..
కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు.. చాలామంది రకరకాల తీర్మానాలు చేసుకుంటూనే ఉంటారు. ఒకట్రెండు రోజులు ఇవి ఉక్కు సంకల్పాల్లాగే ఉంటాయిగానీ..వారం తిరిగే లోపే వాటి విషయం పూర్తిగా మర్చి పోతుంటారు.
నెల తర్వాత అసలు వాటి ఊసే ఉండదు. సరిగ్గా ఇదే వద్దంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. పండంటి ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ఈ కొత్త సంవత్సరం నుంచే ప్రతి నిత్యం కచ్చితంగా 5 సూత్రాలు పాటించాలని తాజాగా పిలుపిచ్చింది.
ఏ వయసు వారైనా, ఆహారపరంగా ఈ పంచ సూత్రాలను పాటిస్తే జబ్బుల గుప్పిట చిక్కుకోకుండా ఆనందంగా జీవించటానికి ఆస్కారం ఉంటుందని, దీనికి ఈ 2019 నుంచే శ్రీకారం చుట్టాలని నొక్కి చెబుతోంది సంస్థ.
ఆహారమే ఆధారం
మన ఆరోగ్యానికి నిత్యం మనం తినే, తాగే పదార్థాలు ఎంతో కీలకం. మన శరీరానికి వ్యాధులతో, రకరకాల సూక్ష్మక్రిములతో పోరాడే శక్తినివ్వటం దగ్గర నుంచి..
గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్ల వంటి సమస్యలు దరిజేరకుండా చూడటం వరకూ.. ప్రతిదీ మనం తీసుకునే ఆహారంతో ముడిపడి ఉందనే విషయం మర్చిపోకూడదు.
ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉండేవారైనా, ఏ వయసు వారైనా ఈ సూత్రాలను పాటించటం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చనీ, వీటిని అమల్లో పెట్టేందుకు ఈ కొత్త సంవత్సర ఘడియలే సరైన సమయమని సంస్థ నొక్కి చెబుతోంది.
1 రకరకాల పదార్థాలు తినాలి!
2 ఉప్పు తగ్గితేనే మేలు
3 కొవ్వులు, నూనెలు తగ్గించాలి
4 తీపి కూడా చేదే సుమా..
5 మద్యానికి ‘సురక్షిత స్థాయి’ లేదు