Food Therapy

ఫుడ్ థెరఫి 

63.00

మరిన్ని Telugu Books కై
Share Now

Description

Food Therapy Book

కేరళ ఆయుర్వేద వైద్యం అనగానే ఎవరికైనా మొదట ఆయిల్‌ మసాజ్‌ స్ఫురిస్తుంది. నూనె పట్టించి మర్దనా చేయించుకుంటే నొప్పులు వదిలి హాయిగా ఉంటుంది కాబట్టి, మంచిదే అనే అభిప్రాయం కూడా అందరిలో ఉంది.
కానీ తైల మర్దన అనేది మనకున్న అవగాహనకు మించి ఉపయోగకరమైనది.
శరీరతత్వం ఆధారంగా, రుగ్మత మూలాల్లోకి వెళ్లి, ఎంచుకోగలిగిన తైల మర్దనాలు లెక్కలేనన్ని! వాటి ఫలితాలూ లెక్కించలేనన్ని!
ఆయుర్వేద చికిత్సలో ఎలాంటి రుగ్మతకు చికిత్స చేయాలన్నా, దాన్ని పంచకర్మ అంటారు. దాని ఫలితం పూర్తిగా శరీరానికి దక్కాలంటే ముందుగా శరీరాన్ని విషరహితంగా మార్చాలి.
ఇందుకోసం ‘పూర్వకర్మ’ చికిత్సను అనుసరించక తప్పదు. ఈ చికిత్సలో భాగంగా దేహాన్ని విషరహితంగా మార్చడం కోసం బాహ్యంగా, అంతర్గతంగా తైలాలను వాడతారు.
బాహ్యంగా తైల మర్దన చేయవలసి ఉంటుంది. అంతర్గతంగా తైలాలను తాగవలసి ఉంటుంది. తైల మర్దన చికిత్సలన్నీ రోగుల రుగ్మతలు, వారి శరీరతత్వాల ఆధారంగా ఎంచుకోవలసి ఉంటుంది.
చికిత్సల్లో కొన్ని నిర్దిష్ట నూనెలు, చూర్ణాలు, మర్దన పద్ధతులు అనుసరిస్తారు. వీటిని ఆయుర్వేద తైల చికిత్సలు అంటారు. వీటిని శరీరతత్వం (వాత, పిత్త, కఫ), రుగ్మతల ఆధారంగా ఆయుర్వేద వైద్యులు సూచిస్తారు.