Anupana Vaidya Sarvaswam book
Author: Lolla Ramachandrarao (Ramji)
బియ్యం ఒక్కటే ఏ విధముగా అన్నము, పులిహెూర, దధోజనం, చకరపొంగలి తయారు చేసుకుని తిన్న తర్వాత ఏ విధంగా రంగు, రుచి, వాసన మొదలైనవి
ఒకేరకంగా ఉండవో అదే విధముగా ఒక ఔషధం / మందు తీసుకొన్న వివిధ అనుపానాలు (తేనె, నెయ్యి, కషాయం మొదలగు)తో వివిధ రోగాలు తగ్గించుటయే ఈ అనుపాన వైద్యముఖ్యోద్దేశ్యము.
ఈ అనుపానాలను అనేకమంది భిషక్ (ఆయుర్వేద వైద్యుల)ల అనుభవములని మరువరాదు. అలాగే శాస్త్రకారులు కొన్ని రకాల అనుపానాలను కూడా సూచించారు.
అందువల్ల ఈ వైద్యం అనుభవ పూర్వక వైద్యశాస్త్రమని మరువవద్దు. ఇది అన్ని రకాల వైద్యముల యందు కన్పించును. ఇప్పటి ఈ వైద్యం ఆయుర్వేద ఉపాంగ భాగముగా, ఆయుర్వేద శాస్త్ర విభాగముగా భావించాలి.
ఈ గ్రంథములో అనుపానము గూర్చి వ్యాసాలు, ద్రవ్య విజ్ఞానం, భైషజకల్పం, పరిభాష, లాంటి అనేక విషయాలు ఇందు చర్చించటం జరిగింది.
ఈ పుస్తకం వైద్యులకు మంచి గురువులా ఉపయోగపడుతుందని నా ఆశ. ఇందులో మాకు(నాకు) సంబంధించిన అనుభవ అనుపానాలు మొదలైనవి చేర్చాను.
అంతేగాక, రోగానుసారం, ఔషధానుసారం అనుపాన పథ్యా పత్యాలు ఇవ్వటం వల్ల గ్రంథాన్ని పూర్తిగా చదివితేగాని పూర్తి నిర్ణయం తీసుకోరాదని నా మనవి.
అంతేగాక వైద్యేతరులు ఈ పుస్తకములోని యోగములను, అనుపానాలను పెద్దలను సంప్రదించివాడుట మంచిది.
ఎందుకనగా ఇందు భస్మాలు, రసౌషధాలు, విష, ఉపవిషాలు కలసిన అనేక మందులను గూర్చి ప్రస్తావన రావటమే. కావున వైద్యునకు అత్యూహం పనికిరాదు. నిదానం అవసరము.
నిదానంగా వ్యాధినిర్ధారణ చేసి సరైన అనుపానం, పధ్యాపధ్యం మోతాదును నిర్ణయించుకో గలిగితే ప్రతీ వైద్యుడు ధన్వతరియే. – రామ్‌జీ EcoPathy