Description
పెరట్లో పెరిగే కలబంద పెద్ద ఔషధాల నిధి అనే వాస్తవం ఈ నాటికీ అందరినీ చేరలేదు. వాస్తవానికి కలబందలో జీవ కణాలను పునరుజ్జీవింపచేసే అపారమైన శక్తి ఉంది.
ఇది సుదీర్ఘకాలం జీవించేందుకు, మనిషి ఆయుష్షును పెంచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది.
అనేక విటమిన్లు, ఎంజైములు, ప్రొటీన్లు, క్యాల్షియం, మానవ దేహానికి కావలసిన అన్ని రకాల పోషకాలు కలబందలో ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.
కలబంద సేవించడం వల్ల గుండె ర క్తనాళాలు పరిశుభ్రమై గుండె జబ్బులు దూరమవుతాయి. కిడ్నీల్లో ఉండే రాళ్లను తొలగించడంతోపాటు, కొత్తగా రాళ్లు తయారు కాకుండా కలబంద నివారిస్తుంది.
ఇది జీవకణాలను అంతరించిపోకుండా కాపాడుతుంది. అంతరించిపోయిన జీవకణాలను పునరుజ్జీవింపచేయడంలో కూడా గొప్పగా పనిచేస్తుంది.
శరీరంలోని విషపదార్థాలను వెలికి నెట్టివేస్తుంది. మూత్ర సంబంధ వ్యాధులను రాకుండా చేస్తుంది. చెడు రక్తాన్ని మంచి రక్తంగా మారుస్తుంది.
జీర్ణవ్యవస్థలోని లోపాలను తొలగించడం ద్వారా ఆ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. మలబద్దకంతో బాధపడే వారికి ఇది మంచి మందు.
మలాన్ని పలుచబరచడం ద్వారా కలబంద సుఖవిరేచనం కలిగేలా చేస్తుంది. 40 ఏళ్లు దాటిన వారిలో జీవకణాలు నశించిపోవడం ఎక్కువవుతుంది.
ఆ కారణంగా, నీరసం, నిస్సత్తువ, శరీరం తరుచూ రోగగ్రస్తం కావడం, అకాల వృద్ధాప్యం, మతిమరుపు వంటి సమస్యలు తలెత్తుతాయి. కలబంద ఆ పరిణామాలకు తావు లేకుండా చేయడంతో పాటు జీవకణాలను చైతన్యవంతం చేస్తుంది.