Chiru Dhanyalu

చిరుధాన్యాలు
రచయిత : లొల్ల రామచంద్రరావు (రామ్ జీ)

 

54.00

Out of stock

మీ ఈమెయిల్ ఇచ్చిన యెడల, పుస్తకము స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఈమెయిల్ పంపగలము

మరిన్ని Telugu Books కై
Share Now

Description

Chiru Dhanyalu Book

చిరుధాన్యాలు
రచయిత : లొల్ల రామచంద్రరావు (రామ్ జీ)

గింజలుంటే మందులెందుకు?

‘ఆహారంలో తొలి స్థానం దేనిది’ అని అడిగితే వచ్చే సమాధానం ఒకటే… విత్తనం అన్నదే. తృణధాన్యం, చిరుధాన్యం, పప్పుధాన్యం, డ్రై నట్స్‌… పేరేదైనా అన్నీ గింజలే.

చివరకు వాడే నూనెలన్నీ కూడా వాటి నుంచి తీసేవే. పోషక విలువలు మెండుగా ఉండే ఈ గింజల్లో చాలా రకాల్ని మనం పెద్దగా పట్టించుకోం.

కానీ అవి ఆరోగ్యానికి ఎంతో మంచివన్న పరిశోధనలు వెల్లువెత్తడంతో ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఆ నయా సూపర్‌ సీడ్స్‌ గురించి…

గుండెకు గుమ్మడి గింజ

పూర్వకాలంలో కూరకోసం గుమ్మడికాయ కోస్తే అందులోని గింజల్ని ఎండబెట్టో వేయించో తినేవారు. క్రమంగా ఆ అలవాటుపోయింది.
కానీ గుమ్మడికాయతో పోలిస్తే గింజల్లో వ్యాధులతో పోరాడే, ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఫైటోస్టెరాల్‌్్స శాతం ఎక్కువ. ఒమేగా, మోనో అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీఆమ్లాలతోబాటు ఫాస్ఫరస్‌, మాంగనీస్‌లూ అధికంగా లభ్యమవుతాయి.
ఇవన్నీ కీళ్లనొప్పులకు కారణమయ్యే ఇన్‌ఫ్లమేషన్‌నీ తగ్గిస్తాయి. వీటిని తినేవాళ్లలో మూత్రాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తక్కువ. గర్భిణీలకి ఇందులోని జింక్‌ వల్ల గర్భాశయ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
కంటి ఆరోగ్యం సరేసరి. ఈ గింజలకి పొట్ట, రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌, పేగు క్యాన్సర్లని అడ్డుకునే శక్తి ఉందట. వీటిల్లోని అధిక మెగ్నీషియం, పీచు కారణంగా మధుమేహం, బీపీ అదుపులో ఉంటాయి.
అన్నింటికన్నా వీటిల్లోని ప్రొటీన్లు ఈ శతాబ్దం ఎదుర్కొంటోన్న అతిపెద్ద సమస్య అయిన నిద్రలేమినీ నివారిస్తాయి.
సో, పచ్చిగానో వేయించుకునో పెరుగులోనో సలాడ్లలోనో గుప్పెడు గుమ్మడి గింజల్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఎముకలకీ బలం… గుండెకీ భద్రత.

పుచ్చతో సంతానసాఫల్యత

పుచ్చకాయను తింటూ ఓ గింజ లోపలకు వెళితే పొట్టలో చెట్టు మొలుస్తుందేమోనని దాన్ని కక్కేందుకు విశ్వప్రయత్నం చేసిన చిన్నతనాన్ని తలచుకుంటే ఇప్పుడు పడీపడీ నవ్వుకుంటాం.
కానీ వీటిల్లోని పోషకాల గురించి విని, వీటిని విడిగా కొని మరీ తింటున్నారిప్పుడు. పుచ్చగింజల్లో దొరికే ఆర్జినైన్‌ అనే ప్రొటీన్‌కి బీపీనీ, హృద్రోగాలనీ నియంత్రించే శక్తి ఉంది.
వీటిల్లో లభించే నియాసిన్‌ నాడీ, జీర్ణవ్యవస్థల పనితీరుకి సాయపడటంతోబాటు చర్మ ఆరోగ్యాన్నీ సంరక్షిస్తుంది. గుండెను కాపాడే మోనో, పాలీఅన్‌శాచ్యురేటెడ్‌, ఒమేగా ఫ్యాటీఆమ్లాలన్నీ ఈ విత్తుల్లో పుష్కలమే. వీటిల్లోని ఫోలేట్‌ గర్భిణులకి ఎంతో మంచిది.
మెగ్నీషియం అలర్జీలు రాకుండా చూడటంతోబాటు వృద్ధాప్యాన్నీ అడ్డుకుంటుంది.ఈ గింజల్లోని ప్రొటీన్లు కండరాలూ, కణజాలాల పెరుగుదలకీ చర్మ సౌందర్యానికీ తోడ్పడతాయి.
జింక్‌, మాంగనీస్‌లు పురుషుల్లో సంతానసాఫల్యతని పెంచుతాయనేది మరో పరిశీలన.

నువ్వులతో రోగం మాయం

రకరకాల వంటల్లో నువ్వుల్ని వాడటం తెలిసిందే. వీటిల్లోని సెసామిన్‌ అనే లిగ్నన్‌, పొట్టలోని బ్యాక్టీరియా కారణంగా ఎంటరోల్యాక్టోన్‌ అనే లిగ్నన్‌గా మారుతుంది.
ఇది ఈస్ట్రోజెన్‌గా పనిచేస్తూ రొమ్ముక్యాన్సర్లూ హృద్రోగాలూ రాకుండా కాపాడుతుంది. మెనోపాజ్‌ దాటిన మహిళలు రోజూ కనీసం ఓ 50గ్రా.
నువ్వుల్ని ఏదో ఒక రూపంలో తినడంవల్ల కొలెస్ట్రాల్‌ తగ్గడంతోబాటు కీళ్లనొప్పులూ మోకాళ్లనొప్పులూ తగ్గినట్లు రుజువైంది.
అనేక రకాల వ్యాధులకి కారణమయ్యే ఇన్‌ఫ్లమేషన్‌నీ తగ్గిస్తాయివి. కాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఐరన్‌, బి1, విటమిన్‌-ఇ, ఫాస్ఫరస్‌… వంటివన్నీ వీటినుంచి లభిస్తాయి.
ఇవన్నీ బీపీని తగ్గించడంతోబాటు కాలేయం దెబ్బతినకుండా రక్షిస్తాయి. ఆర్థ్రైటిస్‌, ఆస్తమా, మైగ్రెయిన్‌, తలనొప్పి, మెనోపాజ్‌ సమస్యల్నీ ఆస్టియోపొరోసిస్‌ వంటి వ్యాధుల్నీ నివారిస్తాయీ గింజలు.
అరకప్పు నువ్వుల్లో అరకప్పు పాలల్లో కన్నా ఎక్కువ కాల్షియం దొరుకుతుంది. కాబట్టి, నువ్వుల్ని ఎలా తిన్నా మంచిదే.

తామర… వసివాడని అందం

ఫూల్‌మఖానా అని పిలిచే తామర గింజల్ని ఉడికించీ లేదా వేయించీ తింటుంటారు. వీటిల్లో ప్రొటీన్లూ మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలతోబాటు ప్రొటీన్లూ ఎక్కువే.
అవన్నీ పక్కనపెడితే, వయసు మీదపడనీయని ఎల్‌-ఐసోఆస్‌పార్టిల్‌ మిథైల్‌ట్రాన్స్‌ఫరేజ్‌ అనే ఎంజైమ్‌ పుష్కలంగా ఉన్నట్లు తేలింది.
ఇది దెబ్బతిన్న ప్రొటీన్లను సైతం బాగుచేస్తుందని తేలడంతో కాస్మొటిక్‌ కంపెనీలూ వీటి మీద దృష్టి పెట్టాయట.
ఇంకా క్యాంఫెరాల్‌ అనే ఫ్లేవనాయిడ్‌ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంతోవాటు వృద్ధాప్యం కారణంగా క్షీణించే కణజాలాన్నీ బాగుచేస్తుందని గుర్తించారు.
అందుకే వీటిని క్రమం తప్పక తినేవాళ్లలో చర్మం మృదువుగా ఉంటుంది. నిద్రలేమిని తగ్గించి ప్రశాంతంగా ఉంచేందుకూ దోహదపడతాయివి.
రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేయడం ద్వారా బీపీ రాకుండా చేస్తాయి. క్యాలరీలు తక్కువగా ఉండే ఈ గింజల్లో పీచుశాతం ఎక్కువ. దాంతో ఆకలి తగ్గుతుంది.
తద్వారా చక్కెరవ్యాధికి చక్కని మందులా పనిచేస్తాయివి. వేయించి తింటే డయేరియా, వాంతులు, అజీర్తినీ తగ్గిస్తాయి. నోటిలో పుండ్లనీ చిగుళ్లవ్యాధుల్నీ కూడా నివారించే తామరగింజ నిజంగానే ప్రకృతి ప్రసాదించిన పరమౌషధం!

కొవ్వును కరిగించే పొద్దుతిరుగుడు

నూనె రూపంలోనే ఎక్కువ పరిచయమైన పొద్దుతిరుగుడు గింజలు అద్భుత పోషకనిల్వలు. 80కి పైగా పోషకాలున్న ఈ గింజల్లో విటమిన్‌-ఇ సమృద్ధిగా దొరుకుతుంది.
ఇది కొవ్వుని కరిగించడంతోబాటు గుండెజబ్బులకీ ఆర్థ్రయిటిస్‌, ఆస్తమా వ్యాధులకీ కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను నియంత్రిస్తుంది. పేగు క్యాన్సర్‌నీ నిరోధిస్తుంది.
సెలీనియం దెబ్బతిన్న జన్యువుల్ని సరిచేయడం ద్వారా క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. మెనోపాజ్‌లో వీటిని తింటే మధుమేహం తలెత్తే సమస్య తగ్గుతుంది.
ఈ గింజల్లోని లినోలిక్‌ ఆమ్లం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మెగ్నీషియం ఎముకల వృద్ధికీ నరాల పనితీరుకీ తోడ్పడుతుంది. గర్భిణులకి మేలు చేసే ఫోలేట్లూ, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే కొవ్వులూ కూడా పుష్కలమే.
వీటిల్లోని ప్రొటీన్లు సెరటోనిన్‌ను విడుదల చేయడం ద్వారా ఒత్తిడినీ డిప్రెషన్‌ని తగ్గిస్తే, కోలీన్‌ జ్ఞాపకశక్తికీ తెలివితేటలకీ తోడ్పడుతుంది.
మొలకెత్తిన గింజల్ని తినడం వల్ల ఛాతీలో కఫం తగ్గి ఉపశమనం ఉంటుంది. ఫ్యాటీఆమ్లాలు చర్మంమెరుపుకీ శిరోజాల పెరుగుదలకీ తోడ్పడతాయి. కాపర్‌ తెల్లజుట్టుని త్వరగా రానివ్వదు.
అందుకే ఈ గింజల్ని వేయించి తిన్నా పిండి రూపంలో వాడినా మంచిదే.

అవిసె ఎంతో ఆరోగ్యం

ఫ్లాక్స్‌ సీడ్స్‌గా పిలిచే ఈ గింజల్లో ఆల్ఫాలినోలిక్‌ అనే ఒమేగా-3-ఫ్యాటీ ఆమ్లం, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, పీచూ ఎక్కువ. ఇవన్నీ ఆస్తమా, క్యాన్సర్‌, డయాబెటిస్‌, ఆర్థ్రైటిస్‌… వంటి వ్యాధుల్ని అడ్డుకుంటాయి.
చేపలు తినని శాకాహారులకి ఇవి ఎంతో మేలు. అవిసె గింజల్లోని ఒమేగా-3-ఫ్యాటీఆమ్లాలు హృద్రోగాలు రాకుండా చేస్తే, లిగ్నన్లు రొమ్ము, ప్రోస్టేట్‌ క్యాన్సర్లనీ అడ్డుకుంటాయి.
ఇక, పీచు పేగుల్లోని విషపదార్థాలన్నింటినీ శుభ్రంగా తుడిచేసి, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది.
బీపీని తగ్గించే సహజ మందుగానూ చెబుతారు. ఆర్జినైన్‌, ఆస్పార్టిక్‌, గ్లుటామిక్‌ అనే ప్రొటీన్లు రోగనిరోధకశక్తిని పెంచడంతోబాటు చెడు కొలెస్ట్రాల్‌నీ ట్యూమర్లనీ అడ్డుకుంటాయి.
వీటిని పిండి రూపంలో వాడితే వాటిల్లోని పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయి.

కుసుమ సౌందర్యం

పొద్దుతిరుగుడు గింజల్లా ఉండే వీటిని కుసుంబాలనీ అంటారు.  ఈ గింజల్లో సన్‌ఫ్లవర్‌లోకన్నా లినోలిక్‌ ఆమ్లం చాలా ఎక్కువ. ఇది కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది.
విటమిన్‌-ఇ కూడా ఎక్కువే. ఇవి మలబద్ధకం, ఆస్తమా ఎగ్జిమా వంటి వ్యాధుల్ని నిరోధించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అరటీస్పూను కుసుమగింజల పొడిలో తేనె వేసుకుని రోజూ రెండుసార్లు తీసుకుంటే ఆస్తమా తగ్గుతుందట.
వీటిని కాసిని పిస్తా, బాదం, తేనెతో కలిపి రోజూ రాత్రిపూట తింటే పురుషుల్లో వీర్యవృద్ధి ఉంటుంది. సంతానలేమితో బాధపడేవాళ్లకి ఇవి ఎంతో మేలు.
వీటిల్లో ఎక్కువగా ఉండే పాలీ అన్‌ శాచ్యురేటెడ్‌ ఆమ్లాల వల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. కాబట్టి వీటినీ పొడిచేసుకుని అన్ని రకాల వంటల్లోనూ వాడుకోవచ్చు.

Author : Lolla Ram Chandrarao (Ramji)