Sangraha Natu Vaidyam

సంగ్రహ నాటు వైద్యం
Author: Lolla Ramachandrarao
Pages : 200

180.00

మరిన్ని Telugu Books కై
Tag:
Share Now

Description

Sangraha Natu Vaidyam Book

సంగ్రహ నాటు వైద్యం
Author: Lolla Ramachandrarao
Pages : 200

ప్రాచీన వైద్యాల గురించి ఆలోచన రావడం పురాతన సాంప్రదాయాలను మళ్ళీ ప్రజలు ఆదరించడం జరుగుతున్న ప్రస్తుత సమయంలో నాటు వైద్యమును గురించి వివరించే ప్రయత్నమే ఈ గ్రంథము.
అసలు నాటు వైద్యం అనే మాటకు శాస్త్రజ్ఞానత (ఆధునిక) లేకుండా చేసే వైద్యమునకు పేరు. అంతేగాక ఆయుర్వేద, అనువంశిక వైద్యులను అల్లోపతి వారు నాటు వైద్యులని పిలవటం పరిపాటి.
అల్లోపతి (ఇంగ్లీషు) వైద్యము ప్రపంచాన్నే ఏలుతున్న ప్రస్తుత తరుణంలో ఆ వైద్యంలో కలిగే దుష్పరిణామాలను అధ్యయనంచేసిన,
చేస్తున్న ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ) సాంప్రదాయ వైద్య విధానాలను కాపాడుకొని వాటిని ఆచరించి అవలంభించడం వల్ల ప్రజలకు మేలు కలుగుతుందని వీటిని “ఆల్టర్ నేటివ్ థెరపీ” గా పేర్కొనటం ఆయుర్వేద వైద్యులకు ఒకింత బాధాకరమే
అయినప్పటికి ఇప్పటికైనా ప్రపంచంలో ఆయుర్వేదం ఉందని ఇంగ్లీషు వారు ఒప్పుకొనటం మనకు సంతోషమే ఎందుకంటే ”శంఖంలో పోస్తే గాని తీర్థం కానట్లు”
ఇంగ్లీషు వారు చెప్పితేగాని శాసనం కాదు అనే పరిస్థితుల్లో మనము ఉన్నాం.
ఒక్కప్పుడు బామ్మ వైద్యంగా, గృహ వైద్యంగా, చిట్కా వైద్యంగా, నాటు వైద్యంగా అనేక రూపాలలో ఉన్న ప్రకృతి వైద్యమైన ఆయుర్వేద వైద్యం ఈ రోజుల్లో నాటు వైద్యంగా పిలవబడుతున్నందుకు సంతోషమే. ప్రకృతి పరంగా మనిషిని ఆరోగ్యంగా ఉంచే ఏ వైద్యమైనా ఆయుర్వేదమే.   – రామ్ జీ