Atma Yogam | Srividya Sadhana Saram

ఆత్మ యోగం | శ్రీవిద్య సాధనాసారం

200.00

Share Now

Description

ఆత్మయోగం
     చంచలమైన మనస్సు వానరం. గురువు అనుగ్రహం వల్ల గురికుదిరిన మనస్సు అద్వితీయమైన వానర వీరుడు – హనుమత్ స్వరూపం. నేడు నిత్య జీవితంలో ఆధ్యాత్మికత గూర్చి ఆలోచించే సమయమే లేక అహరహరమూ ఉరుకులు, పరుగులతో గడుస్తున్న జీవితం చివరకు కదలలేక, కదలచేతకాక ఆసుపత్రి బంధ కంబంధాలలో ముగుస్తుంది. నిజమైన ఆధ్యాత్మిక ఎలా చిగురిస్తే, ఎలా వృద్ధిచెందిచుకోవాలో, జీవితాన్ని ఎలా ఆధ్యాత్మిక ప్రగతిలో పయనింపజేయాలో తేలియజేసేదే ఈ ఆధ్యాత్మిక కథ.
చంచలమైన మనస్సు కలిగిన ఓ సామన్య సగటు వ్యక్తి తన మదిలో మొదలైన ఆధ్యాత్మిక ఆశ, సిద్ధుడైన గురువును గుర్తించడం అనే అంకం విజయవంతంమైన తదుపరి, అకర్ష అనే కామవాసనలతో, మోహమనే బంధంలో చిక్కుకున్న తన జీవన శైలిని ఏ విధంగా మలుచుకొని, పూర్ణుడనే సాధనా సహచరుని సాంగత్యంతో తన సాధనలో ఎటువంటి పరీక్షలనెదురుకొని ముందుకు సాగాడో వివరిస్తున్న ఆధ్యాత్మిక, సామాజిక కథ. ఇందులో సన్నివేశాలు ఎక్కడో ఒక చోట ప్రతి ఆధ్యాత్మిక సాధకుని జీవితానికి అన్వయమౌతాయి. తద్వారా మర్గదర్శకమౌతాయి. ఓ శ్రీవిద్యా ఉపాసకుడు తన ధైనందిన జీవితాన్ని అద్భుతంగా మలచుకొని, తన మనోపుష్పాన్ని అమ్మ పాదాలచెంత చేర్చడంలో ఏ విధంగా కృతార్థుడైనాడో అందంగా వర్ణించడం జరిగింది.
ఈ పుస్తకంలో శ్రీవిద్యకు సంబంధించిన చాలా విషయములను సులభంగా అందరికీ అర్ధమయ్యే రీతిలో ఒక కథ రూపంలో చర్చిచడం జరిగింది. 
ఈ పుస్తకం సాధకులకు, సాధన చేద్దామనుకొనే వాళ్ళకు ఎంతో ఉపయుక్తమవుతుందనుటలో ఎంటువంటి సందేహము లేదు.