Description
స్థాపకవిద్య
ప్రతిష్ఠా విజ్ఞానం
ఆగమాలలో చెప్పబడిన ప్రతిష్ఠా సంబంధమైన అనేక అంశాలను ఒకచోట చేర్చుకుని పరిశీలించి, అవగాహన చేసుకోవాలంటే…. దానికి శాస్త్రంపై పట్టు, విషయాసక్తి, ఓర్పు ఎంతో అవసరం. క్షీరసాగరాన్ని ఎంతో మధిస్తేగానీ… అమృతం పుట్టలేదు. ఆగమాలపై తన పాండిత్యాన్ని మధించి శ్రీ కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య గారు రూపొందించిన పుస్తకమే స్థాపకవిద్య.
పుస్తకం చిన్నదే అయినప్పటికీ విషయపరంగా ఎంతో విస్తృతమైన విజ్ఞానం ఈ పుస్తకంలో కనిపిస్తుంది.
-
ఆలయ నిర్మాణం ఎలాచేయాలి?
-
ఆలయ నిర్మాణానికి ఏది మంచికాలం?
-
గర్భగృహంలో ఏ విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠించాలి?
-
వాహనాలను ఎంత ఎత్తులో ప్రతిష్ఠించాలి?
-
ప్రతిష్ఠలో ఎన్ని క్రియాకలాపాలుంటాయి?
ఇలాంటి 27అంశాలను ప్రామాణికమైన శ్లోకాలతో సహా వివరించారు ఈ పుస్తకంలో.
ఆసక్తిగా చదివేవారికి "అప్పుడే అయిపోయిందా" అని అనిపించినా ప్రతిష్ఠాక్రియాకలపానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన విషయాలని తెలుసుకున్నామనే సంతృప్తితోనే పుస్తకాన్ని ముగిస్తారు. stapaka vidya