Description
శ్రీరామకర్ణామృతం నిజంగా అమృతమే. పాడుతున్నకొద్దీ పారవశ్యంలో ముంచెత్తుతుంది. ఇది వినిపించే చోట రామభక్తి రసార్ణవం పొంగుతుంది. పామరుడిని సైతం పండితుడిని చేసే లక్షణం ఈ కావ్యానికి ఉంది. పతితుణ్ణి సైతం ఉద్ధరించగలదని… చెడును దునుమాడి, మంచికి పట్టం కడుతుందని ఫలశ్రుతిలో కనబడుతుంది. శ్రీరామ కర్ణామృతంలోని రసవైవిధ్యాన్ని నేటిపాఠకులకు పరిచయం చేయడానికి పూనుకున్న అనువాదం ఇది. మీరు రామభక్తులకు ఏదైనా కానుక ఇవ్వాలనుకుంటే ఈ పుస్తకాన్ని మించినది దొరకడం అసాధ్యం.
నేతి సూర్యనారాయణశర్మ నవలారూపంగా రచించిన శంకరవిజయం విశేష పాఠకాదరణకు నోచుకుంది. దరిమిలా శివానందలహరికి రసదీపికా వ్యాఖ్యను, శంకర భాష్యానుసారమైన విష్ణుసహస్రనామ స్తోత్ర భాష్యాన్ని శర్మ సమకూర్చారు. శంకరభారతి ప్రచురణల పక్షాన ఇప్పటివరకు ‘గణేశం భజే!’ (వ్యాస సంకలనం), భుజంగ ప్రయాతం (స్తోత్రాలు) ప్రచురించాం. శంకరుల శివ, దేవీ స్తోత్రాలతో కూడిన గ్రంథాలు త్వరలో రానున్నాయి.