Sindhu Nadi Pushkaralu 2021

మన దేశం లో లేని సింధు నదికి పుష్కర స్నానాలు ఎక్కడ చేయాలి…
సింధు నది గంగా నదిలోని ఒక పాయ. పూర్వము భగీరథుని తపస్సుకు మెచ్చి, గంగ భూలోకానికి, శివుని శిరస్సు మీదుగా దిగి వచ్చింది. శివుడు తన జటాజూటంలోని గంగను, కొంచెంగా బిందు సరోవరంలో విడిచిపెట్టాడు. అక్కడనుండి గంగ ఏడు పాయలై ప్రవహించింది. పావని, హ్లాదిని, నళిని అనే మూడు పాయలు తూర్పుగాను, సీత, సుచక్షువు, సింధువు అనే మూడు పాయలు పడమటగా ప్రవహించాయి. ఏడవ పాయ గంగగా భగీరథుని వెంట వెళ్లింది. ఈ విధంగా శివుని జటాజూటం నుండి పుట్టిన ఈ సింధు నది సాక్షాత్తు గంగా స్వరూపమే. ఈ నది రెండవ రూపం ధరించి వరుణుని సభలో ఉండి, ఆయనను ఉపాసిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. ఈ నదికి పుష్పభద్ర అని మరియొక పేరు కూడ ఉంది.
ఈ నదీ తీరంలో ఒకప్పుడు మార్కండేయ మహర్షి కఠోర దీక్షతో తపస్సు చేశాడు. ఆయన తపస్సును భగ్నం చేయటానికి ఇంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, తపస్సును విరమించ లేదు. చివరకు నరనారాయణులు ఆయనకు ప్రత్యక్షమైనారు. అప్పుడు మార్కండేయుడు ఈ నదీ జలాలతో ఆ స్వామి పాదాలు కడిగాడు. ఆ నీరు తిరిగి నదిలో కలిసింది. విష్ణు పాదాల నుండి పుట్టిన గంగలో ఒక భాగమైన సింధు జలాలు తిరిగి ఆ స్వామి పాదాలే కడిగి, సింధూ నదీ జలాలలో కలిసి పోయింది. అందువల్లనే సింధు గంగ కంటే శ్రేష్ఠమైన నదిగా ప్రసిద్ధికెక్కింది.
ఆ తరువాత మార్కండేయుడు మఱ్ఱి ఆకుపై శయనించిన శ్రీమన్నారాయణుని, ప్రపంచ ప్రళయ కాలమును దర్శనం చేసుకొన్నాడు. ఆ సమయంలో స్వామి శరీరంలో సకల లోకాలు మార్కండేయుడు చూడగలిగాడు. హిమాలయ పర్వతంతో పాటుగా ఈ సింధు నదిని గూడ స్వామిలో చూడగలిగాడు. . దీనిని బట్టి సింధు ఎంత పవిత్రమైన నదియో తేలుతున్నది. ఈ నదిలో నుండి అగ్ని పుట్టింది. అందుకే ఈ నదిని అగ్ని ఉత్పత్తి స్థానంగా పేర్కొన్నారు. ఈ సింధు పేరు మీదుగానే భారతదేశానికి హిందూ దేశమని పేరు వచ్చింది. సింధు శబ్దాన్ని హిందూ అని పలకడం వల్ల ఈ పేరు వచ్చింది. ఈ సింధు నదీ తీరంలోని సామ్రాజ్యాన్ని సింధు దేశమని పిలిచేవారు. మహాభారత కాలంలో కౌరవుల చెల్లెలు దుస్సల భర్త జయద్రదుడు ఈ సింధు దేశపు రాజే. అందుకే అతనిని సైంధవుడు అని కూడ అంటారు. ఇంతటి పవిత్ర నది 1947లో భారతదేశము
విభజించబడినప్పుడు, పాకిస్థాన్ లోకి వెళ్లి పోయింది.
అందువల్ల పుష్కర స్నానం చెయ్యడానికి, అవకాశం లేని దానికి పెద్దలు మార్గాంతరాన్ని సూచించారు. దాని ప్రకారము, కాశీకి గాని, హరిద్వార్ గాని వెళ్లి గంగా నదిలో, సింధు నదీ పుష్కర సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తే, సింధుగూడ గంగ లోని ఒక పాయే గాబట్టి ఆ పుణ్యం వారికి లభిస్తుంది.21st నవoబర్ 2021 నుండి dec 02 2021 వరకు..కాశీ వెళ్ళండి మీ భరద్వాజ్ శర్మ phd in astrology

Share Now

Description

Sindhu Pushkaram | సింధు నది పుష్కరాలు

సింధూ నది (సంస్కృతం: सिन्धु ; ఆంగ్లం: Indus River) భారత ఉపఖండంలో ప్రసిద్దమయిన హిమ నది. ఇది హిమాలయాలలోని టిబెట్దేశంలో పుట్టి కాశ్మీర్, పంజాబ్, సింధు రాష్ట్రాలలో ప్రవహించి పాకిస్తాన్‍ లోని కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. పాకిస్థాన్లోని అతిపెద్ద, జాతీయ నది సింధు. సింధు నదికి జీలం, చీనాబ్, రావీ, బియాస్, సట్లెజ్ ఉపనదులుగా ఉన్నాయి. ప్రవహించే ప్రాంతం అంతా భూమిని అత్యంత సారవంతంగా మారింది. ఈ నదుల మీద పాకిస్తాన్ ప్రభుత్వం మంగళా ఆనకట్ట, సుక్కూలారు వంతెన, భారతదేశంలోని పంజాబులో సట్లెజు నది మీద భాక్రానంగల్ ఆనకట్ట వంటి భారీ ఆనకట్టలు కట్టి వ్యవసాయక్షేత్రాలకు నీటిని అందించి గోధుమ, వరి, చెరకు విరివిగా పండించడమేకాక జలవిద్యుత్తును ఉత్పత్తి చేసి పరిశ్రమలకు సరఫరా చేస్తుంది. సింధు నది పొడవు 2880 కి.మీ. సింధునది ప్రవాహిత ప్రాంతంలో హరప్పా, మొహంజోదారో నాగరికత వర్ధిల్లింది. సింధు నదీ లోయలో సుమారు 5,000 సంవత్సరాల ఉజ్జ్వలమైన సింధు నాగరికత వెలసి వర్థిల్లింది.
 
సింధూ నది టిబెట్టులోని మానస సరోవరం, కైలాస పర్వతాలనుంచి జమ్ము కశ్మీరులోని లడాఖు మీదుగా- గిల్గిట్‌ఉ, బాల్టిస్థాను నుండి పాకిస్థానులోని పంజాబు రాష్ట్రం గుండా ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రవహించి కరాచీ ద్వారా అరేబియా మహా సముద్రంలో కలుస్తోంది. సింధూ నదికి సంబంధించిన అనేక ఉపనదులు భారతులోని జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌ల మీదుగా ప్రవహించి పాకిస్తాన్‌లో ప్రవేశిస్తాయి. 3,180 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే సింధూనది వార్షిక నీటిప్రవాహం ప్రాతిపదికన ప్రపంచంలో 21వ అతి పెద్ద నదిగా గుర్తింపు పొందింది. చైనా, భారత్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ల మీదుగా ప్రవహించే ఈ జీవనది పరీవాహక ప్రాంతం మొత్తం 11,65,000 చదరపు కిలోమీటర్లు. వార్షిక ప్రవాహ లెక్కల ప్రకారం సింధు నది ప్రపంచంలో కెల్లా 21వ అతిపెద్ద నదిగా రికార్డు నమోదు చేసింది.[ భారత పాకిస్తానులు సింధు నదీ జలాలను వినియోగించుకునేందుకు ఒక అంతర్జాతీయ నీటి పంపక ఒడంబడికను కుదుర్చుకున్నాయి.
 
సింధూ నది ఒకరకంగా పాకిస్థానుకు జీవనాడి! పాకిస్తాన్లోని పంజాబ్‌ రాష్ట్రంతో సహా ఆ దేశంలోని మొత్తం 65% భూభాగం సింధూ పరీవాహక ప్రాంతమే. ఆ ప్రాంతంలో నిర్మించిన కాలువల వ్యవస్థ, ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. పాక్‌లోని 90% ఆయకట్టు ఈ కాలువల ద్వారానే సస్య శ్యామలమవుతోంది. పాకిస్థానులోని మూడు అతి పెద్ద ఆనకట్టలు, అనేక చిన్న ఆనకట్టలు సింధూ పరీవాహక ప్రాంతంలోనివే. సింధూ నది పాక్‌ విద్యుత్తు అవసరాలను, తాగు, సాగునీరు అవసరాలను తీర్చే కామధేనువు. ఈ ఆనకట్టలలో తర్బేల ఆనకట్ట ఒకటి.