Description
తొలి నిఘంటువు
అమరకోశం వంటి నిఘంటువులు సంస్కృతంలో అనేకాలున్నాయి. అయితే వాటిని కంఠస్థం చేయవలసిందే తప్ప, ఇప్పటి నిఘంటువుల వలె ఎప్పటికప్పుడు కావాల్సిన శబ్దాన్ని చప్పున వెతుక్కునే అవకాశం లేదు. సంస్కృత భాషా ప్రేమికులు ఈ పద్ధతికి అలవాటు పడి ఉన్నారు. అందుకే నేటికీ సంస్కృతం – తెలుగు నిఘంటువులు తెలుగులో చాలా తక్కువగా లభిస్తున్నాయి. కాగా 1875లో పరవస్తు శ్రీనివాసాచార్య సమకూర్చిన ‘సర్వశబ్ద సంబోధిని’ సమగ్రమైన నిఘంటువు. సంస్కృతాంధ్ర నిఘంటువులలో ఇదే మొదటిది. చాలాకాలంగా పునర్ముద్రణకు నోచుకోని ఈ గ్రంథాన్ని మోహన్ పబ్లికేషన్స్ వారు చక్కటి క్వాలిటీ ముద్రణతో అందుబాటులోకి తెచ్చారు.
సర్వశబ్ద సంబోధిన్యాఖ్యోయమ్
సంస్కృత నిఘంటువు – ఆంధ్రటీకా సహితం
కూర్పు : పరవస్తు శ్రీనివాసాచార్య, | తొలిప్రచురణ : 1875, | పేజీలు : 1100