Description
ఈ పుస్తకంలో ప్రధానంగా 16 వ్యాసాలు ప్రచురించబడినాయి. 1857- 1947 వరకు దేశంలో వచ్చిన మార్పులు, స్వాతంత్ర్యం కోసం సమాజంలోని వివిధ రంగాల్లో పని చేస్తున్న వ్యక్తులు , వ్యవస్థ ఏ విధంగా పని చేశాయో వివరించడం జరిగింది.
దేశానికి స్వతంత్రం సంపాదించుకోవాలంటే ప్రజలు, మేధావులు అంతర్ముఖులై చేసిన ప్రయత్నాలు, ఎలాంటి పోరాటాలు చేయాలి అని ఆలోచించిన సందర్భాలు, వాటి ప్రయాణం, అనుభవాలు ఇందులో ఉన్నాయి.
1857 స్వతంత్ర పోరాటం తరువాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ పార్లమెంట్ పరిధిలో మారడం. భారత దేశ ఆంతరంగిక శక్తి ని నిర్వీర్యం చేయడానికి బ్రిటిష్ వాళ్ళు చేసిన , చేపట్టిన కుయుక్తులు, కుతంత్రలు , దేశ విచ్చినకర శక్తులకు సహకరించడం లాంటి కీలక అంశాలు వివిధ ఈ వ్యాసాల్లో ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది.
దేశ స్వంతత్ర్యంలో పాల్గొంటున్నామంటూనే, ఇస్లామిక్ శక్తులు, బ్రిటిష్ వారితో చేయి కలిపి దేశ వ్యతిరేకంగా చేసిన పనులను సైతం ఇందులో వివరించడం జరిగింది.
ఈ పుస్తకం దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని వివిధ కోణాల్లో విశ్లేషిస్తూ ఒక దిగ్విజయ చరిత్రను సంక్షిప్తంగా పాఠకులకు అందించే పుస్తకం