Description
శ్రీరుద్ర నమక వైభవమ్
ఇది పరమేశ్వర సంబంధ జ్ఞానం. మన మహర్షులు దర్శించి ఆ పరమేశ్వరుడంటే ఏమిటో చెప్పిన గొప్ప విషయం. అయితే వేదం గురించి మాట్లాడాలంటే అది ఎవరి వల్లాకాదు. వేదం గురించి ఒక్క పరమేశ్వరునికి తప్ప ఇంకొకరికి తెలియదు. అందుకే ఆయన వేదవిత్.
అనంతం వేదం. “వేదః శ్శివః శివో వేదః” అన్నారు. వేదమే శివుడు, శివుడే వేదం. అలాంటి వేదమయమైన ఆ శివత్వాన్ని శివపరమైన మంత్రాలద్వారా తెలుసుకోబోతున్నాము. వేదంలో ప్రతిమంత్రం శివుని ప్రతిపాదిస్తున్నది, మరి విష్ణువును గురించి చెప్పద్దా అని అనొద్దు. శివుడు, విష్ణువు అని ఇందరు లేరు. ఉన్నది ఒక్కడే పరమేశ్వరుడు. పరమేశ్వరుని గురించి వేదం వివిధ విధములుగా చెప్తున్నది. ఆ చెప్తున్న విషయములలో ‘వేదములలో శివుడు’ అనగానే కాస్త అవగాహన ఉన్నవారికి గుర్తుకు వచ్చేది రుద్రనమక మంత్రరాశి.
ఇప్పుడే వేదం యొక్క స్వరూపాన్ని చెప్పుకుంటే కాని ఇది అర్థం కాదు. వేదం అనేది లౌకికమైన శబ్దం కాదు. ఇతర మతస్థులకు ఏవో పవిత్ర గ్రంథములున్నాయి. అలాంటి ఒక పవిత్ర గ్రంథం వేదము – అని మనం అనుకోకూడదు. వాళ్ళకు తెలియక అనుకోవచ్చేమో కాని వేదం ‘గ్రంథం’ కాదు. ఇది ముందు తెలుసుకోవాలి.
వేదం శబ్ద స్వరూపమైన ఈశ్వరుడు. అంటే వేదంలో ప్రతి శబ్దం పరమేశ్వర
స్వరూపమే. అది సాక్షాత్ ‘అపౌరుషేయము’ అని చెప్పబడుతుంది. అంటే మానవ
నిర్మితము కాదు. ఈశ్వర నిర్మితమైన దృశ్య ప్రపంచం ఉన్నట్లే ఈశ్వర నిర్మితమైన
శబ్ద ప్రపంచం కూడా ఉండాలి కదా! ఆ శబ్ద ప్రపంచమే వేదమంటే. అయితే ఈ
శబ్దం ఎవరికి వినపడుతుంది? లోకానికి పనికివచ్చే శబ్దములు మనం వాడుతుంటాము.
కాని ఈశ్వరమయమైన శబ్దం వినాలి అంటే ఈ చెవులు పనికిరావు. ఈ చెవులను
ఈ లోకంలోని శబ్దాలు వినడానికే ఇచ్చాడు భగవంతుడు.
మహాభారతం అందచేసింది శతరుద్రీయం అనే అధ్యాయనం పేరుతో. అదే శివరహస్యం అనే గ్రంథంలో ‘రుద్రనమక స్తోత్రంగా’ చెప్పారు. ఆ రుద్రాధ్యాయంలో వేదంలో ఏం చెప్పబడిందో దాని విషయములన్నీ ఇందులో కూర్చబడ్డాయి. ఆ స్తోత్రాలను అందరూ జపించవచ్చు.
రుద్రుని శివునిగా చూడడమే రుద్ర నమకం యుక్క అంతరార్థం. ప్రత్యేక ప్రక్రియగా శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి వాఙ్మయ యజ్ఞం ‘శ్రీరుద్రనమక వైభవమ్
పటలు: 284