Description
శ్యామలాదేవీ సాక్షాత్కారం (శ్యామలా దండకానికి సమగ్రభాష్యం)
అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్యవైభవం
తం నరంపపుషి కుంజరంముఖే మన్మహే కిమపి తుందిలం మహః మాణిక్యవీణాముపలాలయన్తీం మదాలసాం మంజులవాగ్విలాసం మహేన్ద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసాస్మరామి
శ్యామలా దండకము అంటే చాలామందికి అవగాహన ఉంటుంది. ఇందులో ఉన్న సంస్కృత భాషా సౌందర్యం, శ్రావ్యగుణం వంటి లక్షణాల చేత సంస్కృతం తెలిసినవారు, కాస్త భారతీయ వాఙ్మయంతో పరిచయం ఉన్నవారు అందరికీ ఈ దండకముపై ప్రీతి ఏర్పడుతుంది.
శ్యామలాదండకము కేవలం పాదాల యొక్క కూర్పు మాత్రమే కాదు, ఇందులో మంత్ర, యంత్ర సంకేతాలు, దేవీ వైభవం వివరింపబడ్డాయి. శ్యామలా ఉపాసనా శాస్త్రమే ఈ శ్యామలాదండకము. శ్యామలా విద్య దశమహావిద్యలలో ఒకటి. ఈ దశమహావిద్యలు దేనికవే పరిపూర్ణవిద్యలు, పది విద్యలూ ఒక్క అమ్మవారివే.
‘మాతంగి’ మొత్తం పది విద్యలలో ఒక ప్రత్యేకమైన విద్య. ఈ తల్లి పేరు రాజమాతంగి. ఈ రాజమాతంగికే శ్యామలాదేవి అని పేరు. ‘మాతంగకన్యాం ‘మనసా స్మరామి’ అని అమ్మని ధ్యానిస్తారు.
శ్యామలాదేవిని ఆరాధిస్తే జ్ఞానం వస్తుంది. ఆవిడను ఆరాధిచాలనే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం రావాలంటే పూర్వపుణ్యవిశేషం ఉండాలి. ఆ తల్లిని ఒక్కసారి ఆశ్రయిస్తే ఆ తల్లి అనుగ్రహంతో తెలివితేటలు వస్తాయి. ఎవరినైతే సరస్వతి, వాగ్దేవి, బ్రాహ్మి అని పూజిస్తున్నామో, ఆ సారస్వత స్వరూపమే శ్యామలాదేవి. శ్యామలా, సరస్వతి భిన్నరూపాలు కావు. శ్రీశ్యామలాదేవి చతుర్విధ పురుషార్థాలను అనుగ్రహిస్తుంది.
ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్వీరు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు ప్రవచన పాఠాన్ని, దీనికి అనుబంధంగా శ్యామలాదేవి పూజావిధానం, స్తోత్రములు సంకలనాన్ని కూడా ఈ గ్రంథంలో అందించారు. పేజీలు: 112