Sale!

Keyura Bahu Charitra

కేయూరబాహుచరిత్ర
– Manchena Kavi

396.00

Share Now

Description

KeyuraBahu Charitra కేయూరబాహు చరిత్ర
కావ్య ఇతి వృత్తము

కేయూర బాహుచరిత్రము ఒక రసవత్తరమైన ప్రబంధము. నాలుగశ్వాసములతో నున్న ఈ గ్రంథాన్ని మంచన అను కవి రచించి నండూరి గుండమత్రి అంకిత మిచ్చెను. మంచన తన గ్రంథంలో తన గురుంచి ఏమియును చెప్పుకొన లేదు. కనుక అతని కులము, గోత్రము, ఎక్కడ నివసించిన వాడో తెలుసుకొనుట కష్టము. సాధారణంగా కవులందరూ తమ గ్రంథ అవతారికలో గాని, ఆశ్వాసాంతములో గాని తమ గురించి, తమ కుల గోత్రాల గురించి చెప్పుకొనుట సాంప్రదాయం. దాని వలన అయా కవుల వివరాలు తెలుస్తాయి. కానీ మంచన మాత్రము, కారణమేమైనా… అటువంటి వివరాలను పూర్తిగా విస్మరించారు. ఈ కావ్యంలో తన పేరును మాత్రము ప్రస్తావించిన రెండుసందర్భాలు మాత్రము ఉన్నాయి.

మంచన తన కేయూరబాహుచరిత్రము లోని ఇతివృత్తమును రాజశేఖర కవి సంస్కృతమున రచించిన విద్దసాలభంజిక అని నాటిక నుండి గ్రహించి నట్లు తెలియుచున్నది. కాని మంచన కవి మాత్రము తన కావ్య ఇతివృత్తాన్ని ఎక్కడినుండి గ్రహించినది చెప్పలేదు. ఇతి వృత్తాన్ని సంస్కృత నాటిక నుండి గ్రహించినను మంచన తన గ్రంథంలో సందర్బోచితంగా అనేక మార్పులు చేసి, అనేక నీతి కథలను చేర్చి గ్రంథ విస్తారమును పెంచారు. మంచన చేసిన కొన్ని మార్పులు సముచితముగానూ, సరసములుగ నున్నవని…..