Alayamulu Agamamulu

ఆలయములు ఆగమములు

243.00

+ Rs.30/- For Handling and Shipping Charges
Share Now

Description

ఆలయములు – ఆగమములు
దేవాలయం హిందూధర్మానికి హిమాలయ శిఖరం వంటిది. అటువంటి ఆలయాల విశిష్టత, ఆగమశాస్త్ర నిబంధనలను గురించి రచయిత కందుకూరి వేంకటసత్య బ్రహ్మాచార్య ‘ఆలయములు- ఆగమములు’ పేరుతో ఒక గ్రంథం రచించారు. హిందూ దేవాలయాల నిర్మాణానికి సంబంధించిన 250కి పైగా అంశాలను ఈ గ్రంథంలో క్రోడీకరించారు. ఈ గ్రంథంలో వివిధ ఆలయాలను గురించి, వాటి నిర్మాణం గురించి, ప్రశస్తినీ వివరణాత్మకంగా చిత్రాలలో సహా వివరించారు. విగ్రహారాధన ప్రాధాన్యత, ఆవశ్యకత, విగ్రహ తత్వాలను గురించి విశదీకరించారు. ఆగమశాస్త్రం- శిల్పశాస్త్రం, ఆగమ సాంప్రదాయాలను గురించి వివరించారు.
 
ఒక అధ్యాయంలో వివిధ సంప్రదాయాలు గల మందిరాలను గురించి, వివిధ దేవాలయాల శిల్ప ప్రతిష్టలను గురించిన వివరాలను చిత్రాలతో సహా వివరించారు. మరో అధ్యాయంలో వివిధ ఆరాధనా పద్ధతులను గురించి సవివరంగా ప్రస్తావించారు. వివిధ దేవాలయల ఉత్సవాలను గురించి వివరించారు. ‘ప్రతి ఒక్కరూ దేవాలయాలను దర్శించాలి, దేవాలయాలు దేవునికి నిలయాలు, మానవుని మనుగడకు, చిత్తశుద్ధికి, ప్రశాంత జీవనానికి ఏకైక గమ్యస్థానం’ అంటారు రచయిత. ఆలయాల ఆలంబన లేకుండా హైందవ సంస్కృతి చుక్కాని లేని నావ వలె ఉంటుందంటారు. దేవాలయాలు ధ్వంసమైనపుడు వాటిని జీర్ణోద్ధరణ చేయకుంటే అక్కడ దుర్భిక్షం, ప్రజాపీడ, రాజపీడ జరుగుతుందని, ప్రజలు అనేక ఆపదలకు గురవుతారని ఆగమశాస్త్రం చెబుతున్నదని రచయిత పేర్కొన్నారు. ఆలయాల జీర్ణోద్ధరణ ఏ విధంగా చేయాలో రచయిత సవిరంగా తెలిపారు.
 
ఆలయాలు, ఆగమాలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ గ్రంథం తెలియజేసింది. ప్రతి ఆలయంలోనూ, ఆయా ఆగమములు, వాటి విధానాలు, అవి సూచించిన మార్గంలోనే ఆలయనిర్వహణ జరగాలని రచయిత విన్నవించారు. ఆలయ అభివృద్ధిని ఆగమ క్రియలతో పరిపుష్టం చేయాలని, అందుకోసం ఆలయ సంస్కృతిని, ఆగమ ఆదేశాలను విధిగా పాటించాలని రచయిత పేర్కొన్నారు. దేవాలయాల విశిష్టతను తెలుసుకునేందుకు ఈ గ్రంథం ఉపకరిస్తుంది.
 
పుస్తకంలోని విషయాలు
01. ఆలయాలు
02. విగ్రహారాధన
03. ఆగమములు
04. ఆలయ నిర్మాణం
05. కుంభాభిషేకం (ప్రతిష్ట)
06. ఆరాధన
07. ఉత్సవములు
08. దేవాలయ దర్శనము
09. జీర్ణోద్ధరణ
10 ఆలయ నియమములు

temples agamas |  alayalu agamalu | ఆలయాలు ఆగమాలు