Description
YogaVasistam (Telugu) యోగవాశిష్టం (సంస్కృతం: योग-वासिष्ठ, IAST: Yōga-Vāsiṣṭha) వాల్మీకి మహర్షి చేత రచింపబడిన ఒక గ్రంథం.ఈ గ్రంథంలో మొత్తం 29,000 శ్లోకాలు ఉన్నాయి.ఇదే గ్రంథం “లఘు యోగవాశిష్ట్యం ” అనే పేరుతో 6,000 శ్లోకాల తో ఉంది. ఈ గ్రంథం మొత్తం పూర్తైన శతాబ్దం తెలియదు కానీ, 6వ నుండి 14వ శతాబ్దం అని అంచనా. ఏది ఏమైనా మొదటి సహస్రాబ్ది లో ఈ గ్రంథం ఉంది అని గట్టి నమ్మకం.
ఈ గ్రంథం పేరు వశిష్ట మహర్షి మీద ఉంది, ఆయన శంకరాచార్యుల. ద్వారా వేదాంతములో మొట్ట మొదటి ఋషిగా చెప్పబడ్డారు. ఈ గ్రంథం అంతా వశిష్టునికి, రాముడికి మధ్య సంవాదం లా కొనసాగుతుంది. ఈ గ్రంథంలో మొత్తం ఆరు అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయంలో రాముని జీవితం పట్ల వైరాగ్యం,, ప్రాపంచిక విషయముల పట్ల చిరాకు మొదలైన విషయములు ఉంటయి. రెండవ అధ్యాయంలో రాముని వ్యక్తిత్వం ద్వారా, మోక్షం, అది పొందడానికి కావల్సిన గుణాలు చెప్పబడ్డాయి. మూడు, నాలుగు అధ్యయాలు దానికి కావల్సిన ఆధ్యాత్మిక జీవితం, స్వయం కృషి, ఇంకా సృష్టి రహస్యాలు కథల రూప్ంలో చెప్పబడ్డాయి. ఈ రెండు పుస్తకాలు మనిషి స్వేచ్ఛ, బుద్ధి గురించి చర్చిస్తాయి. ఐదవ అధ్యాయంలో ధ్యానం, ఆత్మ సాక్షాత్కారానికి దాని ప్రయోజనం తెలపబడింది, ఆఖరి పుస్తకంలో సంపూర్ణ జ్ఞానం పొందిన రాముని గురించి చెప్పబడింది..