Description
మంచి మాట ఎవరు చెప్పినా విని జీవితంలో ఆచరణలోకి తెచ్చుకోవాలి.
ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహానుభావులు మనం మన జీవితాలను
కాంతివంతం చేసుకోవడానికి గొప్ప బోధలెన్నో చేశారు. సందేశాలు
అందించారు. మన ప్రాచీన ఆధునిక సాహిత్యాలలో మహాకవులు చెప్పిన,
మనం జీవితంలో ఆచరణలోకి తెచ్చుకోదగిన వాక్యాలను, అట్లాగే ప్రపంచ
సాహిత్యంలో పలువురు మహా రచయితలు, శాస్త్రవేత్తలు, రాజనీతిజ్ఞులు,
సమాజ సేవకులు, కళాకారులు చెప్పిన గొప్ప వాక్యాలను ఈ (గ్రంథంలో
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మగారు రమణీయంగా వివరించారు.
ఎవరు చెప్పినా విని తొందరపడకుండా దాని గురించి సమగ్రంగా
ఆలోచించి, దానిలోని సామంజస్యాన్ని (గ్రహించి దాన్ని జీవితానికి
అన్వయించుకోమంటాడు సుమతి శతక కారుడు. శర్మగారు ఆ గొప్ప
వాక్యాలను మన కోసం ఈ గ్రంథంలో చక్కగా వివరించారు. ఈ
వాక్యాలను శ్రీ గురుదేవుల వాక్యాలుగా కూడా స్వీకరించి మన జీవితాలకు
అన్వయించుకుంటే ధన్యులమవుతాము.
చాగంటి కోటేశ్వరరావుగారు ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. ఈయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు. ఈయన తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. 1959 జూలై 14వ తేదిన ఈయన జన్మించారు. కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరిగారు. వీరికి ఇద్దరు పిల్లలు; ఈయన ధారణ శక్తి, జ్ఞాపకశక్తి చెప్పుకోదగ్గవి. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నారు. చాగంటి కోటేశ్వరరావు 2024 నవంబర్ 9న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమితుడయ్యాడు.
- ASIN : B0DZ24PCPN
- Publisher : Sahithi Books (2 March 2025)
- Perfect Paperback : 400 pages
- Item Weight : 330 gr
- Dimensions : 3 x 14 x 21.5 cm
- Country of Origin : India
- Generic Name : Vinadagunevvaru Cheppina వినదగునెవ్వరు చెప్పిన
- vinadagu nevvaru cheppina CHAGANTI BOOKS