Rukmini Kalyanam – Chaganti books

40.00

Share Now

Description

‌బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ

BrahamaSri Chaganti Koteshwara Rao Sharma

Sample pdf

భీష్మకుడు అంటే ప్రతివారికి శరీరం లోపల వాసం ఉన్నవాడు. ఆయనకు ఐదుగురు కొడుకులు
ఉంటారు. వారే రాజ్యాన్ని నడుపుతుంటారు. ఐదుగురికి రుక్మ అన్న పేరు ఎందుకు పెట్టారు అంటే ఈ
ఐదే ఐదు జ్ఞానేంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శేంద్రియం అంటే చర్మం. ఈ ఐదు కలిపి
ఐదు గుఱ్ఱాలు కలిసి రథాన్ని లాగేసినట్లు లాగుతుంటాయి. లోపల ఈ ఐదుగురు అన్నదమ్ముల వెనక
పుట్టిన చెల్లెలు అయిన బుద్ధి అదృష్టవశాత్తు వినడం చేత భగవంతుడిని నమ్ముతుంది. ఇంద్రియాలు ఎలా
చెపితే అలా నడవడానికి అవి ఒప్పుకోలేదు. అందుకని అన్నదమ్ములు చైద్యునికి ఇచ్చి వివాహం
చేస్తామని అన్నారు. చైద్యుడు అంటే చిత్త ప్రకోపమైన కామం. పుట్టిన కోరిక వైపు ఇంద్రియాలను తిప్పేస్తూ
ఉంటాయి. అలా పుట్టే కోరికలను ఇచ్చి పెళ్ళి చేయాలని ఇంద్రియాలను మనసు లోపల ఎప్పుడూ
కోరుకుంటూ ఉంటుంది. కానీ వివాహమైతే మనసు కోరుతుంటుంది, ఇంద్రియాలు తిప్పుతుంటాయి.
భవసాగరంలో ప్రపంచంలో పడి ఉంటాడు. అలా తిరగకుండా ఇవి అన్నీ అక్కరలేదు భగవంతుడు
కావాలి అంటే వాడు కోరికలు కోరడు ప్రపంచంలో తిరగడు.