Description
Sri Madhaandhra Bhagavatham Pravachanam
”శివ”, ”శంకర”, ”శంభుః” ఈ నామములన్నీ ”సుఖము” అను శబ్దమునే నిర్వచిస్తాయి. ”జ్ఞాన దాతా మహేశ్వరః” – శివుడు జ్ఞానకారకుడు. సమస్త కళలు ఆయన నుండే ఆవిర్భవించినవి. ఆయనే సకల విద్యలకూ ఆలవాలము. సమస్త వికారములకూ, అరిషడ్వర్గములకూ అతీతుడై, నిత్యము ప్రశాంతముగా ఉండే మూర్తి శంకరుడు. అందుకే ”సదా శివ” అన్న నామము ఒక్క శంకరునికే అన్వయం అవుతుంది. అటువంటి పరమేశ్వరుని గూర్చిన అనేక విషయములు ”శ్రీ శివమహాపురాణము”లో వివరింపబడినవి.