Maheswara Vaibhavam

మహేశ్వర వైభవం

250.00

Share Now

Description

       మనమెప్పుడూ పూజ చేస్తూ ఉండము. బాగా జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏ పనిలో ఉన్నా, భగవంతుని నామం చెప్పడానికి శౌచం, అశౌచం అడ్డగించవని. పూజ చేసేటప్పుడు శౌచంతో మనముండాలి. ప్రీతితో, సంతోషంతో, భగవంతుని పిలుస్తున్నప్పుడు శౌచమవసరం లేదు. ఆర్తి కలిగి ద్రౌపది కృష్ణుని పిలిచింది. అప్పుడు ఆమె ఏకవస్త్ర. రజస్వలాదోషంతో ఉండి కృష్ణుని పిలిస్తే వచ్చి రక్షించాడు. గజేంద్రుడు మృత్యుసదృశమైన భయంకరమైన స్థితిలో ఉండగా ఎలుగెత్తి ప్రార్థిస్తే ఈశ్వరుడు వచ్చాడు. నోటికి ఒక అష్టోత్తర శతనామ స్తోత్రం రాలేదంటే మనుష్యజన్మలో ఏదో పోగొట్టుకున్నట్లు గుర్తు. మనకి ఆర్తి కలిగి, సంతోషం కలిగి, భగవంతుని ఒకసారి స్మరించాలి అనిపిస్తే రామ రామ అనుకోవచ్చు కాని, ఒక స్తోత్రం నోటికి తిరిగి ఉంటే బస్సులో వెళుతూ, రైలులో వెళుతూ, ఎక్కడ కూర్చున్నా మనసులో అనుకుంటూ ఉండవచ్చు.