Description
దశావతారాలు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే పరమేశ్వరుడు అవతారాలు ఎందుకు స్వీకరిస్తాడు, దశావతారాలు అని పది అవతారాలు ఎందుకు విశిష్టతను పొందాయి? అన్న విషయం మీద మనకు ఒక సంగ్రహమైన అవగాహన ఏర్పడుతుంది. తార అన్న మాటకి వ్యతిరేకపదం అవతార. తార అంటే నక్షత్రం కాదు. తార అంటే ముత్యం. ఎంత నైర్మల్యంతో, మలినం లేకుండా శుద్ధమైనదిగా ఉంటుందో అంత శుద్ధమైనది అని ఒక అర్థం. తరింపచేసేది కాబట్టి తార అని రెండవ అర్థం.