Sale!

Sri Venkateswara Vilasam telugu book

శ్రీ వేంకటేశ్వర విలాసం

– Sri vaddiparti padmakar

150.00

Share Now

Description

vaddiparti padmakar books

“వినా వేంకటేశం ననాథో ననాథః”
కలియుగం లో భక్త జనోద్ధరణకే అవతరించిన శ్రీ వేంకటేశ్వరుడు సర్వదా, సర్వథా స్మరణీయుడు.
“పురాణాంతర్గత శ్రీ వేంకటాచల మహాత్మ్యం, పద్మపురాణం,వరాహ పురాణం ఇత్యాది గ్రంథాలు ఆధారంగా పండిత పామరులను అలరింపచేసే సరళ వ్యావహారిక శైలిలో, అష్టాదశ పురాణములపై తనకు గల సాధికారతను, ఆ ఏడు కొండల వానిపై తనకు గల అచంచల భక్తిని వ్యక్తం చేస్తూ రచయిత అందించిన ఈ ఆణిముత్యం, ఆధ్యాత్మిక పరిపూర్ణతకై తపించే వారు తప్పక చదవవలసిన గ్రంధం” అని ప్రముఖల ప్రశంసలు అందుకున్న ఈ రచనను మీరూ పఠించి స్వామి అనుగ్రహాన్ని పొందండి.

“నేను వైకుంఠాన్ని విడిచి అయినా ఉంటాను కానీ నా భక్తులను మాత్రం విడిచి ఉండలేను” అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిజ్ఞ.
స్వామి ఆ ప్రతిజ్ఞను నిలంబెట్టుకుంటున్న విధానాన్ని కనులకు కట్టి చూపించే అద్భుత రచన ‘శ్రీ వెంకటేశ్వర విలాసం’. స్వామి వారి నివాస స్థలమైన తిరుమల, తిరుమల లోని వివిధ తీర్థములు, వివిధ పర్వతములు, దేవాలయములు, వాటి మహత్తుతో పాటు వాటిని దర్శించవలసిన విధి విధానములు సరళంగా, వివరంగా మనసుకు హత్తుకునే విధంగా వివరించ బడిన ఈ గ్రంథం పఠించిన వారు నిస్సందేహంగా ఆధ్యాత్మిక బల సంపన్నులు కాగలరు.

Venkateswara Vilasam

Sri Venkateswara Vilasam – Sri Vaddiparti Padmakar