Description
శ్రీ వెంకటేశ్వర వాస్తు శాస్త్రము
ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవునికి సూర్యుని యొక్క అవసరం ఎలాగైతే ఉందో అదే విధంగా “వాస్తు” శాస్త్రము కూడా అంతే అవసరమై ఉన్నది. “పంచభూతాల యొక్క అమరికే” ఈ “వాస్తు”. నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరికి ఈ శాస్త్రం పై అవగాహనా ఎంతో అవసరమై ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు అవటం వలన శాస్త్రము పై అందరికి కూడా రోజు రోజుకు మక్కువ పెరుగుతూ ఉన్నది. ప్రతి మనిషి జీవితంలో కూడా పెండ్లికి ఎంతో ప్రాధాన్యమిస్తారో అలాగే ఇంటి నిర్మాణానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు.
పెండ్లి, ఇల్లు ఈ రెండూనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా జీవితావసరాలుగా ఉన్నాయి. అందువలన ప్రతీ ఒక్కరూ ఈ శాస్త్రాన్ని చక్కగా అవగాహన చేసుకొని దానిని పాటించి మంచి ఫలితాలు పొంది అందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ శాంతులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి…
– యన్నామని వెంకటరత్నం