Description
వాస్తవ వాస్తు పూజావిధానము
పూజా విధానమంతా మంత్ర పరిపూర్ణమే. భారతీయ సంప్రదాయంలో అనేక విధాలైన పూజా విధానాలు ఉన్నాయి. గృహ సంబంధమైన పూజ విషయాలలో వాస్తు పురుషుని పూజా విధానము ప్రత్యేకమైనది. ఏయే సందర్భాలలో వాస్తు పూజను చేయాలో విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథములో వివరంగా ఇవ్వబడింది. ఈ వాస్తు పురుషుని పూజా విధానము అన్ని ప్రాచీన వాస్తు గ్రంథాలలో ఉంది.
పదికాలాలపాటు గృహంలో నివసించేవారు సుఖంగా జీవించాలంటే శాస్త్ర బద్ధంగా శంకుస్థాపన చేయాలి. శాస్త్రోక్తంగా నిర్మించాలి. అప్పుడే గృహం నాలుగు కాలాల పాటు సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. గృహంలో నివసించేవారు సుఖంగా జీవిస్తారు.
ఇది మాత్రమే నిజమైన వాస్తు పూజా విధానమని చెప్పడంలో సందేహము లేదు. వాస్తు పురుషుని ఆవిర్భావ విషయాలే కాక, శంకుస్థాపనతో కూడిన వాస్తు పూజా విధానము నియమబద్ధంగా అత్యంత విపులంగా వ్రాయబడిన గ్రంథాలు తెలుగులో చాలా తక్కువ. ఆ పూజా విధానాన్ని అందరికీ తెలియాలని స్వచ్ఛమైన తెలుగులో తెలుగు ప్రజల కోసం చి|| శ్రీరామకృష్ణ అత్యంత శ్రద్ధతో తయారుచేశాడు. ఈ విధానమును నిష్ఠతో ఆచరించిన వారికి గృహనిర్మాణ విషయములలో ఏ విధమైన ఆటంకములు కలగవు.