జీర్ణోద్ధార విధిః”
ఆలయ వ్యవస్థలో కీలకమైన ప్రక్రియ జీర్ణోద్ధారణ. ప్రకృతి నియమాలవల్ల, కాలక్రమేణా ఏర్పడే మార్పులవల్ల, లేదా మానవ సంబంధమైన కారణాలవల్ల… ఆలయాలు, అందులోని మూర్తులు జీర్ణమైతే దానిని మార్చి నూతనంగా ఆలయాన్ని, మూర్తులను ఏర్పాటు చేసే ప్రక్రియే ఈ జీర్ణోద్ధారణ.
తెలుగునాట ప్రతిష్ఠా కలాపానికి సంబంధించి ఎన్నో గ్రంథాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో జీర్ణోద్ధారణ విషయాలు నామమాత్రంగానే కనబడుతున్నాయి. వాటిని అనుసరించి ఈ ప్రక్రియను నిర్వహించడం పండితులకు సైతం కష్టసాధ్యమే. ఈ విషయాన్నిదృష్టిలో ఉంచుకుని సంకలనం చేసిన గ్రంథమే ఈ “జీర్ణోద్ధారణ విధిః”
(ఇది నా ఎనిమిదవ గ్రంథం) -Appala Shyam Praneeth Sharma
వెల ₹50/- కాపీలకు Devullu.com