Viswakarmavaasthu Sastra Rityaa Mee Indla Ayamulu

           విశ్వకర్మవాస్తు శాస్త్రరీత్యా
మీ ఇండ్ల ఆయుములు 

180.00

Share Now

Description

విశ్వకర్మవాస్తు శాస్త్రరీత్యా మీ ఇండ్ల ఆయుములు 

Author : Sri chitrala Gurumurth Guptha 

ఆయం యొక్క ప్రాముఖ్యత
గృహం, శిల్పం, వస్తువుల తయారీకి కొన్ని పద్ధతులు ఉంటాయి. వీటికి పొడవు, వెడల్పులకు సంబందించిన వివరాలు అవసరం. ఈ వివరాలు అన్నింటిని తెలుసుకొని ప్రకృతికి అనుకూలంగా శ్రేయస్సు కలిగే విధంగా నిర్మాణాలు చేయటం వలన జీవితం ఆనందదాయకం అవుతుంది. ఈ విధంగా శాస్త్ర ప్రకారం నిర్మాణాలు చేయటానికి ఆయం అవసరం.
ఆయం అనే పదం ఆదాయం అనే అర్ధంలో వాడబడుతుంది. గృహం కాని ఇతర నిర్మాణాలు కాని తమ ఇష్టం వచ్చినట్లు నిర్మించుకోవచ్చును. కానీ ఆయం కట్టి నిర్మాణాలు చేయటం ద్వారా వ్యక్తికి మేలు కలుగుతుంది. చేసిన నిర్మాణం పూర్తి కాలం ఉపయుక్తమవుతుంది. అందువల్ల ఆయం ఎక్కువ మేలు కలిగిస్తుంది. ఈ ఆయాలలో కొన్ని మంచి ఆయాలు, కొన్ని చెడు ఆయాలు ఉంటాయి. చెడు ఆయాలను దూరంగా ఉంచి మంచి ఆయాలు స్వీకరించవచ్చును.
ఒకొక్క దిక్కుకు ఒకొక్క ఆయం ఉంటుంది. అవి వరసగా
1) ద్వజాయము :- పురుష ముఖం, తూర్పు దిక్కు, విజయాలు, అభివృద్ధి, ఆరోగ్యం ఉంటాయి.
2) ధ్రూమాయము :- పిల్లి ముఖం, ఆగ్నేయ దిక్కు, అన్ని విధాల నష్టాలు ఉంటాయి.
3) సింహాయం :- సింహా ముఖం, దక్షిణ దిక్కు, విజయాలు, అభివృద్ధి ఉంటాయి.
4) శ్వానాయం :- కుక్క ముఖం, నైరుతి దిక్కు, అన్ని విధాల నష్టాలు ఉంటాయి.
5) వృషభాయం :- వృషభ ముఖం, పడమర దిక్కు, విజయం, అభివృద్ధి, సంతానం.
6) ఖరాయం :- గాడిద ముఖం, వాయువ్య దిక్కు, అన్ని విధాల నష్టాలు ఉంటాయి.
7) గజాయం :- ఏనుగు ముఖం, ఉత్తర దిక్కు, ధనాభివృద్ధి, సంతానాభివృద్ధి ఉంటాయి.
8) కాకాయం :- కాకి ముఖం, ఈశాన్య దిక్కు, అన్ని విధాల నష్టాలు ఉంటాయి.
ఆయా దిక్కులకు ఆయా ఆయాలు స్వస్ధానాలుగా ఉన్నాయి. స్వస్ధానానికి ఐదవ దిక్కు శత్రు వర్గం అవుతుంది.
దిక్కుల యందు (తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం) మనుష్య, దేవతా నివాసములను ఏర్పాటు చేయవచ్చును. విదిక్కుల యందు నిర్మాణాలు చేయరాదు.
నిర్మాణాలకు అవసరమైన పొడవు వెడల్పును బట్టి వైశాల్యం సాదిస్తే దానిని క్షేత్రీకృత పదం అని అంటారు. ముఖ ద్వారాలను అనుసరించే ఆయ నిర్ణయం చేయాలి. దిక్కులను అనుసరించి కాదు.
తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తరాలలో ఏ దిక్కులో గృహ నిర్మాణం చేసిన ద్వజాయం కలిగిన గృహపదం శ్రేష్ఠమైనది.
దక్షిణ, పశ్చిమ, ఉత్తరాలలో ఏ దిక్కులో గృహ నిర్మాణం చేసిన ద్వజ, సింహా ఆయం కలిగిన గృహపదం శ్రేష్ఠమైనది.
పశ్చిమ ఉత్తర దిక్కులలో ఏ దిక్కులో గృహ నిర్మాణం చేసిన ద్వజ, సింహా, గజ ఆయాలు కలిగిన గృహపదం శ్రేష్ఠమైనది.
పశ్చిమ దిక్కులో గృహ నిర్మాణం చేసిన ద్వజ, సింహా, గజ ఆయాలు కలిగిన గృహపదం శ్రేష్ఠమైనది.
ప్రతి ఆయమునకు ఐదవ ఆయం శత్రు ఆయం అవుతుంది