Description
వాస్తు దుందుభి
Author: Kalanadhabatta Venkataramanamurthy
ఇంద్రియములన్నిటియందును నేత్రమునకు వలె గృహవాస్తు గ్రంథములన్నిటియందును ఈ గ్రంథమునకు ఎక్కువ ప్రాముఖ్యత కలిగియున్నది. ఇందు సందేహ మెంత మాత్రమును లేదు. వివిధ గ్రంథములు, పురాణములు, సత్సాంప్రదాయములు, సుప్రసిద్ధ శిల్ప్యభిప్రాయములు, లోక వ్యాప్తి సుఖానుకూలత వీటిని సరిచూచి (ప్రకృతానుకూల మగునట్లు) షడ్విధమతముల చేతను ఇతర గ్రంథాపేక్ష లేకుండునట్లీ గ్రంథము చెప్పబడినది.
సామాన్యులకును, ధనికులకును అనుకూలమైన గృహ నిర్మాణతత్సౌకర్యాదులను సూక్ష్మముగా ఒకే గ్రంథముచే తెలియజేయగల గ్రంథము దీనికంటే యింకొకటి యింతవరకు ఎచ్చటను లేదు. వాస్తుగ్రంథారణ్యము నుండి సంగ్రహింపబడిన రహస్య సిద్ధాంతములతో కూడియున్న ఈ నవీన గ్రంథము గృహవాస్తు విషయములను తెలిసికొనగోరువారికి సంతోషదాయకమై యొప్పుచున్నది.